హాస్యంతో పాటు ఎమోషనల్‌గా కూడా: బ్రహ్మీ

Brahmanandam Talks about Namasthe Nestamaa Movie

Mon 11th Nov 2019 10:27 PM
brahmanandam,namasthe nestamaa,movie,role  హాస్యంతో పాటు ఎమోషనల్‌గా కూడా: బ్రహ్మీ
Brahmanandam Talks about Namasthe Nestamaa Movie హాస్యంతో పాటు ఎమోషనల్‌గా కూడా: బ్రహ్మీ
Advertisement

‘నమస్తే నేస్తమా’ చిత్రంలో హాస్యంతోపాటు ఎమోషనల్‌గా ఉండే క్యారెక్టర్ చేశాను - నటుడు బ్రహ్మానందం. 

కె.సి. బొకాడియా చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎంద‌రో  స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, వేగంగా 50 సినిమాలు కంప్లిట్‌ చేసిన బాలీవుడ్‌ పాపులర్‌ ఫిలిం మేకర్‌. లేటెస్ట్‌గా లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నమస్తే నేస్తమా’. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్‌బస్టర్‌హిట్‌ సాధించిన ‘తేరి మెహర్భానియా’ చిత్రానికి పార్ట్‌-2 వస్తోన్నఈమూవీ ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు కె.సి.బొకాడియా. ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో యువ న‌టుడు  శ్రీరామ్ గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇస్తున్నారు.  ఈ చిత్రానికి బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రెండు కుక్క‌లు ముఖ్య పాత్రలు పోషించ‌డం విశేషం. త్వరలో విడుదల కాబోతున్న‌ సందర్భంగా...

నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ - ‘‘కె సి బొకాడియా గారు నిర్మించి తొలిసారి తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా నమస్తే నేస్తమా. ఈ సినిమాలో నేను హాస్యమే కాకుండా కొంచెం ఎమోషనల్ గా ఉండే క్యారెక్టర్ చేశాను. నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన క్యారెక్టర్. బొకాడియా గారు నిర్మాతగా చాలా  ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయనతో సినిమా చేస్తున్నపుడు ఏ రకమైన టెన్షన్ లేకుండా ఎంతో హ్యాపీగా తనకు కావాల్సినటువంటి రీతిలో ఆర్టిస్టుల నుండి కావాల్సిన పెర్ఫామెన్స్ రాబట్టుకుని అద్భుతమైన సినిమా నిర్మించారు.  నమస్తే నేస్తమా సినిమా థియేటర్ లో చూడండి. పర్టిక్యులర్‌గా నా క్యారెక్టర్ బాగుంటుందని మీకు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు

శ్రీరామ్‌(గెస్ట్ అప్పీయ‌రెన్స్), ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ఖాన్‌, సంగీతం: బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌, ఎడిటర్‌: బి. లెనిన్‌, ఫైట్స్‌: బి.జె శ్రీధర్‌, సమర్పణ: లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌, కో-ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌ చాప్లాట్‌, నిర్మాత: బి.ఎం.బి మ్యూజిక్‌ అండ్‌ మాగ్నెటిక్స్‌ లిమిటెడ్‌, ర‌చ‌న‌- దర్శకత్వం: కె.సి. బొకాడియా.

Brahmanandam Talks about Namasthe Nestamaa Movie:

Brahmanandam about his Role in Namasthe Nestamaa


Loading..
Loading..
Loading..
advertisement