జ్యోతిక ‘జాక్‌పాట్’ విడుదలకు రెడీ!

Sun 10th Nov 2019 02:22 PM
jyothika,revathi,geetha,film distributors,releases,jackpot,movie,tollywood  జ్యోతిక ‘జాక్‌పాట్’ విడుదలకు రెడీ!
Jackpot Movie Release Date Fixed జ్యోతిక ‘జాక్‌పాట్’ విడుదలకు రెడీ!
Sponsored links

గీతా ఫిలిం డిస్టిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 21న జ్యోతిక జాక్‌పాట్ విడుదల !!!

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జాక్‌పాట్. పూర్తిస్థాయి హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జాక్‌పాట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కళ్యాణ్. జ్యోతిక‌కు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. ఇది వ‌ర‌కు ఆమె ఇక్క‌డ చాలా సినిమాల్లో కూడా నటించారు. పెళ్లి త‌ర్వాత కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న‌ జ్యోతిక ఇప్పుడు మ‌ళ్లీ జాక్‌పాట్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇందులో జ్యోతిక‌, రేవతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునున్నాయి. యోగి బాబు, ఆనంద్ రాజ్ ప్ర‌ముఖ పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్నారు. గీతా ఫిలిం డిష్టిబ్యూషన్స్ ఈ చిత్రాన్ని నవంబర్ 21న విడుదల చేస్తోంది.  

న‌టీన‌టులు:

జ్యోతిక‌, రేవతి, యోగిబాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్ర‌న్, మ‌న్సూర్ అలీ ఖాన్, జ‌గ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: క‌ళ్యాణ్

నిర్మాత‌: సూర్య శివ‌కుమార్

స‌హ నిర్మాత‌: రాజశేఖ‌ర్ కరూప‌సుంద‌ర పాండియ‌న్

సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ఎస్ ఆనంద కుమార్

సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్

ఎడిట‌ర్: విజ‌య్ వేలుకుట్టి

పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను

Sponsored links

Jackpot Movie Release Date Fixed:

Geetha Film Distributors Releases Jackpot Movie in Tollywood

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019