‘ఊల్లాల ఊల్లాల’కు ఎట్రాక్షన్ ఎవరో తెల్సా?

Sun 20th Oct 2019 01:23 PM
ullala ullala,popular singers,mangli,roll rida,satyaprakash  ‘ఊల్లాల ఊల్లాల’కు ఎట్రాక్షన్ ఎవరో తెల్సా?
Popular Singers Mangli and Roll Rida turn actors with Ullala Ullala ‘ఊల్లాల ఊల్లాల’కు ఎట్రాక్షన్ ఎవరో తెల్సా?
Sponsored links

‘ఊల్లాల ఊల్లాల’ అంటూ ఉర్రూతలూగించనున్న మంగ్లీ 

తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా ‘ఊల్లాల  ఊల్లాల’ చిత్రంలో నటించింది. అలాగే ఈ చిత్రంలో ఒక పాట కూడా పాడింది. దాంతోపాటు హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ చెప్పింది. నటరాజ్, నూరిన్, అంకిత హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఊల్లాల  ఊల్లాల’. సీనియర్ నటుడు ‘సత్య ప్రకాష్’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ. గురురాజ్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత ఏ. గురురాజ్ మాట్లాడుతూ... ‘‘మంగ్లీకి తెలుగు నాట మంచిపాపులారిటీ ఉంది. ఆమె మా సినిమాలో పాట పాడింది, యాక్ట్ చేసింది, హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ చెప్పింది. ఈ రకంగా మంగ్లీ మా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలువనుంది. అలాగే బిగ్ బాస్- 2 తో క్రేజ్ తెచ్చుకున్న  రోల్ రైడా ఇందులో ఓ పాటపాడడంతో పాటు, ఆ పాటలో నటించారు కూడా. ఇంకా ఈ చిత్రంలో ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి. భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇందులో ఎన్నో వింత క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. మా బేన‌ర్‌లో ‘ర‌క్ష‌క‌భ‌టుడు’, ‘ఆనందం మ‌ళ్లీ మొద‌లైంది’, ‘ల‌వ‌ర్స్ డే’ చిత్రాల త‌ర్వాత వ‌స్తున్న సినిమా ‘ఉల్లాలా ఉల్లాలా’. ఇలాంటి కాన్సెప్ట్‌లు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. స‌త్య‌ప్ర‌కాశ్‌కి న‌టునిగా ఎంత పేరుందో, ద‌ర్శ‌కునిగా అంత‌క‌న్నా ఎక్కువ పేరు ఈ చిత్రం ద్వారా వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను’’ అని చెప్పారు.

దర్శకుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ.. ‘‘ఇదొక రొమాంటిక్ ఎంటెర్టైనింగ్ థ్రిల్లర్. మా అబ్బాయి నటరాజ్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా  గర్వంగా ఉంది. ఈ సినిమాలో చాలా గొప్ప కంటెంట్ ఉంది. చాలా ఎట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్ కూడా వున్నాయి’’ అని చెప్పారు.

Sponsored links

Popular Singers Mangli and Roll Rida turn actors with Ullala Ullala:

Ullala Ullala Movie Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019