‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ టీమ్ హ్యాపీ..

Sun 20th Oct 2019 01:16 PM
ogf,operation gold fish,adivi sai kiran,aadi saikumar,success meet  ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ టీమ్ హ్యాపీ..
Operation Gold Fish Success Meet details ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ టీమ్ హ్యాపీ..
Sponsored links

‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ బాగుందని ప్రేక్షకులంటుంటే సంతోషంగా ఉంది: సాయికిరణ్ అడివి
సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా నటించిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ. బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. ‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ నెల 18న సినిమా విడుదలైంది. సినిమాకు అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమాకు చాలా మంచి అప్లాజ్‌ వచ్చింది. అందరూ బావుందని చెబుతున్నారు. అర్జున్‌ పండిట్‌ పాత్రలో నా నటన, సినిమాకు మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. ప్రతిరోజూ గర్వపడుతూ ఈ సినిమా చేశాను. నా ఫ్రెండ్స్‌, ఫ్యామిలీలు కాంప్లిమెంట్స్‌ ఇస్తుంటే సంతోషంగా ఉంది. కలెక్షన్లు కూడా బాగున్నాయి. ప్రతిచోట పాజిటివ్‌ రిపోర్ట్‌ వస్తుంది’’ అని అన్నారు.

సాయికిరణ్‌ అడివి మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం మా ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ విడుదలైంది. అన్నిచోట్ల నుండి సినిమా చాలా బావుందనే టాక్‌ రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయం వెనుక చాలామంది ఉన్నారు. అబ్బూరి రవి, ఆది సాయికుమార్‌, కార్తీక్‌ రాజు, పార్వతీశం, మనోజ్‌ నందం, నిత్య, ఎయిర్‌టెల్‌ గాళ్‌ శషా, కృష్ణుడు, రావు రమేశ్‌గారు... వీరందరూ ఎంతో మద్దతుగా నిలిచారు. అలాగే, సినిమాటోగ్రాఫర్‌ జయపాల్‌, సంగీత దర్శకుడు శ్రీచరణ్‌. మాకు ఆదిత్య మ్యూజిక్‌ వాళ్లు గ్రేట్‌ సపోర్ట్‌ ఇచ్చారు. వాళ్లకూ థ్యాంక్స్‌. మా టెక్నిషియన్స్‌, టీమ్‌ హార్డ్‌ వర్క్‌తో ఈ సినిమా పూర్తయింది. సినిమా బావుందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది. కొత్తగా ఉందని ప్రేక్షకులు రివ్యూలు రాస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు’’ అని అన్నారు.

నిర్మాతలలో ఒకరైన పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఏ సినిమానైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రయత్నాలు, ఎంతోమంది కృషి ఉంటుంది. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుండి చాలామంది నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ సహకరించారు. విడుదలకు ముందు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. విడుదల కష్టమైంది. అప్పుడు నేను ముందుకు తీసుకొచ్చాను. నాకు ఏ సినిమా అయినా కష్టంలో ఉందంటే... మనం ముందుకు వెళ్లాలనే ఫీలింగ్‌ ఉంటుంది. ఈ సినిమా చూస్తే... ఒక దేశభక్తి భావన కలుగుతుంది. మన దేశాన్ని పాకిస్తాన్‌ ఎన్ని ఇబ్బందులకు గురి చేసింది? వాళ్లు చేసిన అన్యాయాలు ఏంటనే అంశంపై చేసిన సినిమా ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’. కశ్మీర్‌ పండిట్లను ఊచకోత కోయడం, మహిళలపై అత్యాచారం చేయడం దుర్మార్గం. వినడానికి ఎంతో ఇదిగా ఉంటే... పరిస్థితులను అనుభవించిన కశ్మీరులు ఎంత బాధ పడి ఉంటారనే భావనతో ఎంత కష్టమైనా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్సయ్యా. ప్రతి ఒక్కరికీ ఈ సినిమాను ఫ్రీగా చూపించాలని ఉంది. కానీ, నాకు అంత శక్తి లేదు. ఈ దేశభక్తి సినిమాను నిలబెట్టాల్సిన బాధ్యత అందరిదీ. మార్నింగ్‌ షో కంటే సెకండ్‌ షోకి కలెక్షన్లు ఎక్కువ ఉన్నాయి. ప్రతి షోకి కలెక్షన్లు పెరిగాయి’’ అని అన్నారు.

అబ్బూరి రవి మాట్లాడుతూ.. ‘‘సినిమా తీయడానికి సాయికిరణ్‌ అడివిగారు ఎంత కష్టపడ్డారో... సినిమాను ప్రేక్షకులకు చూపించడానికి పద్మనాభ రెడ్డిగారు అంత కష్టపడ్డారు. ఆయనకు చాలా చాలా థ్యాంక్స్‌.  ఒక పాట లేకున్నా, గ్లామర్‌ ఎపిసోడ్‌ లేకున్నా... అర్జున్‌ పండిట్‌ పాత్ర చేయడానికి ఒప్పుకున్న ఆదిగారికి థ్యాంక్స్‌. నాకు తెలిసి హీరోలందరూ నిలబడేది క్యారెక్టర్ల వల్ల. అర్జున్‌ పండిట్‌ పాత్రలో ఆయన చాలా బాగా చేశారు. దర్శకుడు సాయికిరణ్‌ అడివి ఎన్ని కష్టాలు పడి సినిమా చేశారనేది నాకు తెలుసు. అందరూ ఆయన కోసమే ఈ సినిమా చేశారు. కథ అద్భుతంగా తయారు చేసుకున్న, ఈరోజు విజయం అందుకున్న సాయికిరణ్‌గారికి అభినందనలు. ఇటువంటి సినిమా థియేటర్‌కు వెళ్లి చూస్తే... మనది అన్న ఒక ఫీలింగ్‌ వస్తుంది’’ అన్నారు. 

Sponsored links

Operation Gold Fish Success Meet details :

Celebrities speech at OGF Success Meet 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019