Advertisementt

బిగ్‌బాస్: ఈవారం ఎలిమినేషన్ టాస్క్ అదిరింది!

Tue 15th Oct 2019 07:33 PM
nagarjuna,bigg boss,telugu,monday,episode,update  బిగ్‌బాస్: ఈవారం ఎలిమినేషన్ టాస్క్ అదిరింది!
Bigg Boss Telugu: 7 Contestants in Elimination బిగ్‌బాస్: ఈవారం ఎలిమినేషన్ టాస్క్ అదిరింది!
Advertisement
Ads by CJ

మొన్న ఆదివారం జరిగిన ఎలిమినేషన్‌లో మహేష్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా హౌస్ లో మిగిలింది ఏడుగురు సభ్యులు మాత్రమే. ఫైనల్ దగ్గర పడే కొద్దీ ఏడుగురికి తమపై తమకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. దాంతో నిన్న నామినేషన్ ప్రాసెస్ కొంచెం వేడిగా సాగింది. నిన్న బిగ్ బాస్ ర్యాంకింగ్‌ టాస్క్‌ ఇచ్చి... మొదటి మూడు ర్యాంక్‌లలో వున్న వాళ్లు నామినేట్‌ అవరు అని బిగ్‌బాస్‌ చెప్పేసరికి... ఆ ర్యాంకుల కోసం హౌస్ మేట్స్ బేరసారాలు చేయడం స్టార్ట్ చేసారు.

హౌస్ మేట్స్ వచ్చిన చీటీలు ప్రకారం తమ స్థానాల్లో నించున్నారు. మొదటి  స్థానంలో బాబా భాస్కర్, రెండవ  స్థానంలో రాహుల్, మూడవ స్థానంలో వరుణ్, నాలుగవ స్థానంలో ఆలీ, ఐదు జ్యోతి, ఆరు వితిక, ఏడు శ్రీముఖి ఉన్నారు. అయితే రెండో స్థానం కోసం ఏడవ స్థానంలో వున్న శ్రీముఖి రాహుల్ ని అడగగా అతను చాలా హీట్ ఆర్గుమెంట్ తరువాత కుదరదు అని చెప్పేసాడు. ఆ తరువాత అలీ రెజా కూల్‌గా అడిగినపుడు రాహుల్‌ అతనికి తన ప్లేస్‌ ఇచ్చేసాడు.

ఇక మూడో స్థానంలో వున్న వరుణ్ ప్లేస్ గురించి పెద్ద రచ్చ జరిగింది. వరుణ్ కోసం మూడవ స్థానాన్ని వదిలేసుకున్న జ్యోతి అదే స్థానాన్ని అతను వితికకి ఇచ్చేసరికి వాదనకి దిగింది. అక్కడ స్టార్ట్ అయిన రచ్చ వరుణ్ ఆమెను వెక్కిరిస్తూ కొన్ని వెకిలి చేష్టలు చేసి తన ఇమేజ్‌ని మరోసారి భార్య కోసం డ్యామేజ్‌ చేసుకున్నాడు. ఇక శివ జ్యోతి మూడవ స్థానం నుండి కదలకపోవడంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిని నామినేట్ చేసాడు. దాంతో ఈ వారం నామినేషన్‌లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. మరి ఎవరికి ఈ వీక్ తక్కువ ఓటింగ్స్ వచ్చి ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Bigg Boss Telugu: 7 Contestants in Elimination:

Bigg Boss Telugu: Monday Episode Update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ