సమంత.. ఓ టీమ్‌ను మెయింటైన్ చేస్తోంది!

Samantha Arranged One Team for Her Promotion

Tue 15th Oct 2019 07:21 PM
samantha,maintain,one team,promotion  సమంత.. ఓ టీమ్‌ను మెయింటైన్ చేస్తోంది!
Samantha Arranged One Team for Her Promotion సమంత.. ఓ టీమ్‌ను మెయింటైన్ చేస్తోంది!
Advertisement

సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీస్ హడావిడి ఎక్కువ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ అకౌంట్స్‌తో తరచూ ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉంటున్నారు సెలబ్రిటీస్. ఇక హీరోయిన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. వాళ్ళు లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెట్టి ఫ్యాన్స్ కి మరింత దగ్గర అవుతున్నారు.

అలానే సమంత కూడా. తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఏవోక ఫొటోస్ తీసి అవి ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టి ఫ్యాన్స్ ని దిల్ కుష్ చేస్తుంది. అయితే సామ్ పెట్టే ఏ పోస్ట్ అయినా, ఏ ఫోటో అయినా ప్రొఫెషనల్‌గా వుండేలా ఒక టీమ్‌నే అప్పాయింట్‌ చేసుకుంది. ఈ టీంలో ఒక ఫోటో గ్రాఫర్, ఒక పర్సనల్‌ డిజైనర్‌, మేకప్‌ మ్యాన్ అంతా ఉన్నారు. వీరి కోసం ఆమె భారీగా చెల్లిస్తుంది. ఎంత చెల్లించిన క్వాలిటీ ఉన్న ఫొటోస్ వస్తాయి కాబట్టి వారి కోసం భారీగా ఖర్చు పెడుతుంది.

బహుశా చాలామంది సెలబ్రిటీస్ ఇలానే ఒక టీంని అప్పాయింట్‌ చేసుకుంటారేమో... ప్రస్తుతం సెలెక్టెడ్ గా సినిమాలు చేసే సామ్ ఈ పర్సనల్‌ టీమ్‌ దేనికో అనే కామెంట్లు కూడా పడుతున్నాయి. అయితే ఈమధ్య సామ్ తన కుక్కకు సంబంధించి తెగ ఫొటోస్ పెట్టింది. బహుశా ఆ టీంని సామ్ ఆ కుక్కని ఫొటోస్ తీయడానికి అప్పాయింట్‌ చేసుకుందేమో అని కామెంట్స్ కూడా వస్తున్నాయి.

Samantha Arranged One Team for Her Promotion:

Samantha Maintain One Team for Promotion


Loading..
Loading..
Loading..
advertisement