చిరు దంపతులకు మాటిచ్చిన వైఎస్ జగన్!

Mon 14th Oct 2019 08:06 PM
ys jagan mohan reddy,ap cm jagan,megastar chiranjeevi,syeera  చిరు దంపతులకు మాటిచ్చిన వైఎస్ జగన్!
ys jagan-chiranjeevi Discussed key issues in meeting చిరు దంపతులకు మాటిచ్చిన వైఎస్ జగన్!
Sponsored links

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న మెగాస్టార్‌ చిరంజీవి, భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ వారిని సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని మెగాస్టార్‌ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇరువురు సైరా సినిమాతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. 

చర్చలు అనంతరం చిరు ఫ్యామిలీతో కలిసి జగన్ దంపతులు విందు భోజనం చేశారు. ఈ భేటీ పూర్తయిన తర్వాత తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా జగన్ పంచుకున్నారు. ఈ క్రమంలో సైరా సినిమా గురించి వైఎస్ జగన్‌కు చిరు నిశితంగా వివరించారు. సినిమా వీక్షించాలని చిరు దంపతులు.. సీఎంను కోరారు. ఇందుకు జగన్ స్పందిస్తూ కుటుంబ సమేతంగా త్వరలోనే సినిమా వీక్షిస్తానని చిరు దంపతులకు మాటిచ్చారని తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ సతీమణి భారతీకి.. చిరు భార్య సురేఖ చీరను బహుకరించారు. 

‘సైరా’తో చాలా ఆత్మీయ సమావేశం జరిగింది. చిరంజీవి గారు మీరు ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను, నవ్వులను మాకు పంచుతూ ఉండాలి’ అంటూ ఆకాంక్షించారు. జగన్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ఇటు వైసీపీ వీరాభిమానులు.. అటు మెగాభిమానులు పెద్ద ఎత్తున పోస్ట్ చేసుకుంటున్నారు. మొత్తానికి చూస్తే.. భేటీ మాత్రం చాలా సాఫీగా.. సామరస్యంగా జరిగిందని చెప్పుకోవచ్చు.

Sponsored links

ys jagan-chiranjeevi Discussed key issues in meeting:

ys jagan-chiranjeevi Discussed key issues in meeting  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019