ఇక టాలీవుడ్‌లో నయనతార కష్టమే..!

Mon 14th Oct 2019 08:11 PM
nayanthara,tollywood,no chances,movies,sye raa  ఇక టాలీవుడ్‌లో నయనతార కష్టమే..!
No Chances to Nayanthara in Tollywood ఇక టాలీవుడ్‌లో నయనతార కష్టమే..!
Sponsored links

కోలీవుడ్ లో టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్న నయనతార తెలుగులోనూ సీనియర్ హీరోస్ సినిమాలో నటిస్తుంది. భారీ పారితోషకాన్ని తెచ్చుకునే నయన్ సినిమా షూటింగ్స్ కి తప్ప సినిమా ప్రమోషన్స్ కి రాదనేది తెలిసిందే. గతంలో దర్శకుడు మారుతీ, నయనతార మీద సంచలన వ్యాఖ్యలు చేసాడు. బాబు బంగారం సినిమా షూటింగ్ సమయంలో వెంకీ సర్ లొకేషన్స్ కి వచ్చినప్పుడు నయనతార కుర్చీలో నుండి కూడా లేవలేదు. ఓ సీనియర్ హీరోకి నయన్ రెస్పెక్ట్ ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా చిరంజీవి సై రా సినిమా కోసం ఆరు కోట్లిచ్చి తీసుకొస్తే.. ఒక్క ప్రమోషన్స్ కి కూడా నయన్ హాజరు కాలేదు.

అయితే ఆమె డిమాండ్ ని బట్టి చాలామంది దర్శకనిర్మాతలు ప్రమోషన్స్ కి నయన్ రాకపోయినా లైట్ తీసుకుంటున్నారు. కానీ తాజాగా రామ్ చరణ్ బ్రతిమాలినా సై రా ప్రమోషన్స్ కి రాని నయనతారకి టాలీవుడ్ లో ఇక అవకాశాలు కష్టమే అంటున్నారు. ఆమెకి అడిగిన పారితోషకం ఇచ్చి... ఇలా అడుక్కోవాల్సి వస్తుంది కాబట్టి.. ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలెవరు నయన్ కి అవకాశం ఇచ్చే అవకాశం లేనట్టుగా ఫిలింనగర్ టాక్. 

Sponsored links

No Chances to Nayanthara in Tollywood:

Nayanthara Not Attends Movie Promotions  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019