ఆ రికార్డులకు చేరువలో ‘సైరా’!

Thu 10th Oct 2019 02:41 PM
sye raa narasimha reddy,non baahubali records,chiranjeevi,sye raa  ఆ రికార్డులకు చేరువలో ‘సైరా’!
Sye Raa Narasimha Reddy Status at Box Office ఆ రికార్డులకు చేరువలో ‘సైరా’!
Sponsored links

సైరాతో చిరు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఆరు రోజుల్లోనే సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సాహో సాధించిన వసూళ్లని బీట్ చేసింది. మొదటివారంలో బాహుబలి 2 తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన ఘనత ఈ చిత్రంతో చిరంజీవి అందుకున్నారు. ఏడో రోజున ఈమూవీ 100 కోట్లు క్లబ్ లోకి ఎంటర్ అయింది.

అంతేకాదు ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో వంద కోట్లకి పైగా షేర్‌ సాధించిన చిత్రంగా నిలవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ మూవీ రంగస్థలం వసూళ్లని దాటుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. మరో రెండు వారాలు సైరాకు పోటీ ఇచ్చే సినిమాలు ఏమి లేకపోవడంతో మరింత వసూళ్లు చేసే అవకాశం ఉందని అర్ధం అవుతుంది.

మొదటి వారం దసరా పండగ కాబట్టి వసూళ్లు కూడా బాగున్నాయి. ఇక రెండో వారం కూడా అదే ఊపు ఉంటే సైరాకు తిరుగులేదు. ఇప్పటి వరకు తెలుగులో ఉన్న నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నీ సైరా చెరిపేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.

Sponsored links

Sye Raa Narasimha Reddy Status at Box Office:

Sye Raa Narasimha Reddy Creates Non Baahubali Records

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019