మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ అదిరింది!

Thu 10th Oct 2019 02:32 PM
mahesh babu,family pic,super star,namratha,goutham,sithara  మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ అదిరింది!
Mahesh Babu Family Pic Creates Sensation మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ అదిరింది!
Sponsored links

మహేష్ బాబు వృత్తిపరంగా ఎంత కేర్ఫుల్ గా ఉంటాడో... ఫ్యామిలీ విషయంలోనూ అంతే పర్ఫెక్ట్ గా ఉంటాడు. షూటింగ్స్ తో అలిసిసొలసి... తన పిల్లలకి స్కూల్ సెలవలు రాగానే భార్యతో కలిసి విదేశాలకు ఎగిరిపోయే మహేష్ బాబు గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. మహేష్ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి చాలామంది హీరోలు ఇన్స్పైర్ అవుతుంటారు. ఇక ఎప్పుడూ వెకేషన్స్ ని ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేసే మహేష్ ఈసారి దసరా హాలిడేస్ కి స్విజ్జర్లాండ్ లో ల్యాండ్ అయ్యాడు. నమ్రత - గౌతమ్ కృష్ణ - సితారాలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ ఫుల్ గా ఎంజాయ్ చేసాడు.

ఆ ఎంజాయ్మెంట్ ని మాటలలో వర్ణించడం ఎందుకులే అనుకున్నాడేమో.. ఓ క్యూట్ ఫ్యామిలీ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను హ్యాపీ చేసాడు. మహేష్ బాబు వోగ్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజు ఒక ఎత్తైతే... తాజాగా ఫ్యామిలీతో ఇచ్చిన క్యూట్ అండ్ స్టైలిష్ లుక్ మరో ఎత్తు. మహేష్ బాబు చైర్ లో స్టైలిష్ గా కూర్చుంటే.. గౌతమ్ ఆ కుర్చీ అంచు మీద తల్లి నమ్రతని ఆనుకుని కూర్చున్నాడు. ఇక క్యూట్ సితార పాప మహేష్ ఒడిలో స్టైలిష్ లుక్ అండ్ స్మైల్ తో కూర్చుంటే.. నమ్రత మాత్రం సింపుల్ గా భర్త వెనకాల నిల్చుంది. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ ఇంటర్ నెట్ లో తెగ వైరల్ అయ్యింది!!

Sponsored links

Mahesh Babu Family Pic Creates Sensation:

Mahesh Babu Family Pic Hulchal in Social Media

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019