కథ కుదిరితే కళ్యాణ్‌తో చేయడానికి రెడీ: చిరు

Wed 09th Oct 2019 05:42 PM
chiranjeevi,ready,acting,pawan kalyan,movie  కథ కుదిరితే కళ్యాణ్‌తో చేయడానికి రెడీ: చిరు
Chiru’s multi starrer with Pawan and Charan కథ కుదిరితే కళ్యాణ్‌తో చేయడానికి రెడీ: చిరు
Sponsored links

ప్రస్తుతం సైరా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తూ స్టాండర్డ్ గా వెళ్తుంది. తమ సినిమాని ఇంకా ప్రమోట్ చేసుకోవాలనే ఉదేశంతో టీం అంతా నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ కి చిరంజీవితో పాటు సురేంద్రరెడ్డి, నటుడు రవికిషన్, సాయి చంద్, రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మీడియా వాళ్ళు వేసిన ప్రశ్నలకు యూనిట్ సభ్యులు సమాధానాలు చెప్పడం జరిగింది.

అయితే అందులో ఒకరు... మంచి సోషల్ అండ్ పొలిటికల్ కాన్సెప్ట్ ఉన్న కథతో వస్తే పవన్ కళ్యాణ్ గారితో కలిసి మూవీ చేస్తారా? అని అడుగగా చిరు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కచ్చితంగా మంచి కథ వస్తే చేస్తా. నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సిద్దమే అని ఆయన కుండ బద్దలు కొట్టారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. పవన్ కు చాలామంది నిర్మాతలు నుండి ఆఫర్స్ వచ్చాయి.. కానీ దేన్నీ యాక్సెప్ట్ చేయలేదు. కానీ సమకాలీన రాజకీయ పరిస్థితులు, సోషల్ మెస్సేజ్ కలిగిన సినిమాలు పవన్ పొలిటికల్ కెరీర్ కి కూడా ఉపయోగపడే అవకాశం ఉండటంతో ఆయన మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకున్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు కొంతమంది. మరి ఆ కథను ఎవరు రెడీ చేస్తారో చూడాలి. ఆమధ్య సుబ్బిరామి రెడ్డి పవన్ కళ్యాణ్ ని, చిరుని పెట్టి సినిమా చేస్తున్నా అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కానీ ప్రస్తుతం దాని గురించి ఎవరు మాట్లాడడంలేదు.

Sponsored links

Chiru’s multi starrer with Pawan and Charan:

Chiranjeevi Ready to Act with Pawan Kalyan

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019