‘ఏమైపోయావే’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

Wed 09th Oct 2019 05:34 PM
vijaya dasami,special,emai poyave,movie,first look,release  ‘ఏమైపోయావే’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
Emai Poyave Movie First Look Released ‘ఏమైపోయావే’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
Sponsored links

దసరా పండుగ సందర్భంగా ‘ఏమైపోయావే’ మూవీ ఫస్ట్ లుక్  విడుదల  

శ్రీ రామ్ క్రియేషన్స్, వి ఎం స్టూడియో పతాకాలపై హరి కుమార్ నిర్మాతగా రాజీవ్ సిద్దార్ధ్, శాణు మజ్జారి హీరోహీరోయిన్లుగా మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏమైపోయావే’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం  ఫస్ట్ లుక్ ను దసరా శుభాకాంక్షలతో విడుదల చేశారు. ఈ సందర్భంగా....

దర్శకుడు మురళి మాట్లాడుతూ -  ‘‘ఏమైపోయావే ఒక ప్యూర్ ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ట్రై యాంగిల్ లవ్ స్టోరీ. చిత్రీకరణ కొత్తగా ఉండి ఆడియన్స్ కి ఫ్రెష్ మూవీని చూస్తున్నాం అనే అనుభూతినిస్తుంది. హీరో హీరోయిన్లు కొత్తవారైనా చాలా చక్కగా నటించారు. అలాగే మా నిర్మాత హరి కుమార్ గారు మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వస్తోంది. తప్పకుండా మీ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’’ అన్నారు.

నిర్మాత హరి కుమార్ మాట్లాడుతూ - ‘‘మా బేనర్ లో ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా  ‘ఏమైపోయావే’ రూపొందుతుంది. దసరా శుభాకాంక్షలతో మా చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం హ్యాపీ. మురళి గారు ఎంతో ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందరూ కొత్తవారైనా మంచి సపోర్ట్ లభిస్తోంది.  ప్రస్తుతం పోస్ట్  ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

రాజీవ్ సిద్దార్ధ్, శాణు మజ్జారి, మిర్చి మాధవి, జబర్దస్త్ టీమ్ మీసంసురేష్, నానాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి 

డి.ఓ.పి : శివరాథోడ్

మ్యూజిక్ : రామ్ చరణ్

కథ, మాటలు : విజయ్

పాటలు : తిరుపతి జానవ

నిర్మాత : హరి కుమార్ 

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మురళి.

Sponsored links

Emai Poyave Movie First Look Released:

Vijaya Dasami Special: Emai Poyave Movie First Look

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019