బాల‌య్య ఈసారి మాములు కత్తి పట్టలా..!

Powerful Look Released From NBK105

Tue 08th Oct 2019 03:03 PM
balakrishna,powerful,look,released,nbk105  బాల‌య్య ఈసారి మాములు కత్తి పట్టలా..!
Powerful Look Released From NBK105 బాల‌య్య ఈసారి మాములు కత్తి పట్టలా..!
Advertisement

రామోజీ ఫిలిమ్ సిటీలో నంద‌మూరి బాల‌కృష్ణ 105 చిత్రం షూటింగ్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ‘జైసింహా’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. బాల‌కృష్ణ న‌టిస్తోన్న 105వ చిత్రమిది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమాలో బాల‌కృష్ణ పాత్ర‌కు సంబంధించిన మ‌రో లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో బాల‌కృష్ణ  ర‌క్తం అంటిన క‌త్తిని పట్టుకుని ఉన్నారు. ముఖం అంతా రంగుల‌తో నిండి ఉంది.

ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ అక్టోబ‌ర్ 18 నుండి రామోజీ ఫిలిమ్ సిటీలో జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా భారీ విలేజ్ సెట్‌ను వేశారు.

సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు:

నందమూరి బాలకృష్ణ

సోనాల్ చౌహాన్

వేదిక

ప్రకాశ్ రాజ్

భూమిక చావ్లా

జయసుధ

షాయాజీ షిండే

నాగినీడు

సప్తగిరి

శ్రీనివాస్‌రెడ్డి

రఘుబాబు

ధన్‌రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్

నిర్మాత: సి.కల్యాణ్

కో ప్రొడ్యూసర్స్:  సి.వి.రావ్, పత్సా నాగరాజు

కథ: పరుచూరి మురళి

మ్యూజిక్: చిరంతన్ భట్

సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్

ఆర్ట్: చిన్నా

పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు

కొరియోగ్రఫీ: జానీ మాస్టర్

Powerful Look Released From NBK105:

NBK105 Film shooting in RFC


Loading..
Loading..
Loading..
advertisement