రవిబాబు ‘ఆవిరి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Aaviri Movie Release Date Fixed Aaviri Movie Release Date Fixed

‘అల్ల‌రి’, ‘న‌చ్చావులే’, ‘అన‌సూయ‌’, ‘అవును’, ‘అవును 2’.. వంటి ప‌లు చిత్రాల ద్వారా త‌న‌దైన మార్కుతో ద‌ర్శ‌కుడిగా ర‌విబాబు త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆవిరి’. ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా నటిస్తున్నారు.  హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌కానుంది. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత ర‌విబాబు మాట్లాడుతూ... ‘‘రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న మా  చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తున్నాం. సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా, థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. 

న‌టీన‌టులు:

ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ఆర్ట్‌:  నారాయ‌ణ రెడ్డి

ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌

యాక్ష‌న్‌: స‌తీశ్‌

కెమెరా: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి

మ్యూజిక్:  వైధి

స్క్రీన్‌ప్లే: స‌త్యానంద్‌

ర‌చ‌న‌, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: ర‌విబాబు

Aaviri Movie Release on October 18th

ravibabu
aaviri
movie
release
october 18