‘అల వైకుంఠపురములో’కు హైలెట్ అదేనంట!

Mon 30th Sep 2019 05:55 PM
allu arjun,pooja hegde,trivikram srinivas,alavaikunthapurramuloo,movie,comedy  ‘అల వైకుంఠపురములో’కు హైలెట్ అదేనంట!
This is the Mail Highlight to AlaVaikunthapurramuloo ‘అల వైకుంఠపురములో’కు హైలెట్ అదేనంట!
Sponsored links

త్రివిక్రమ్ సినిమాలంటేనే పంచ్ డైలాగ్స్ కు ప్రతీతి. పంచ్ డైలాగ్స్ ని కామెడీగా పండించగల సత్తావున్న దర్శకుడు ఈ మాటల మాంత్రికుడు. అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలను కూడా త్రివిక్రమ్ అలాంటి కామెడీ పంచ్ లతోనే సక్సెస్ చేసాడు. తాజాగా అదే కాంబోలో రాబోతున్న అల వైకుంఠపురములో సినిమా కూడా కామెడీనే హైలెట్ చేస్తూ.. అదిరిపోయే డైలాగ్స్ తో అదరగొట్టేస్తుందట. అల్లు అర్జున్ - పూజ హెగ్డే మధ్యన రొమాంటిక్ సీన్స్ తో పాటుగా... రాహుల్ రామకృష్ణ టైమింగ్ కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.

సినిమాలో అల్లు అర్జున్ సింపుల్ లుక్స్ తోనే వెరైటీగా.. పూజ దృష్టిలో పడటానికి, ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి చేసే పనులు కామెడీగా మరియు రొమాంటిక్ గా.. త్రివిక్రమ్ తెరకెక్కించాడట. ఇక పూజ మాత్రం బన్నీని ఇష్టపడుతూనే.. అతన్ని పట్టించుకోనట్లుగా నటిస్తూ అల్లు అర్జున్ వేసే ట్రయల్స్ ని ఎంజాయ్ చేస్తుందట. మరి ఇదంతా పూర్తి రోమాంటిక్ కామెడీగా త్రివిక్రమ్ రాసుకున్నాడట. ఇక తాజాగా విడుదలైన సామజవరగమన సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

Sponsored links

This is the Mail Highlight to AlaVaikunthapurramuloo:

Superb Comedy in AlaVaikunthapurramuloo Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019