‘సైరా’ ట్రైలర్ రెస్పాన్స్‌తో ఓ లెక్కకొచ్చేశారు

Fri 20th Sep 2019 10:15 PM
sye raa,sye raa narasimha reddy,sye raa movie,chiranjeevi,saaho,baahubali,bollywood  ‘సైరా’ ట్రైలర్ రెస్పాన్స్‌తో ఓ లెక్కకొచ్చేశారు
Sye Raa Team Happy with Trailer Response ‘సైరా’ ట్రైలర్ రెస్పాన్స్‌తో ఓ లెక్కకొచ్చేశారు
Sponsored links

టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు ఇండియా వైడ్‌గా విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ సినిమాలు విడుదలవుతున్నాయి. బాహుబలి స్ఫూర్తితో నిన్నగాక మొన్న సాహో సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా.. బాలీవుడ్‌లో లాభాల కలెక్షన్స్ సాధించింది. ప్రభాస్ బాహుబలి క్రేజ్‌తో సాహో సినిమా అక్కడ హిట్ కలెక్షన్స్ సాధించింది. మరి తాజాగా బోలెడంత హైప్ మధ్యన విడుదల కాబోతున్న సైరా సినిమా కూడా హిందీలో వర్కౌట్ అవుతుందని తాజాగా విడుదలైన సైరా నరసింహారెడ్డి ట్రైలర్ కొచ్చిన స్పందనే చెబుతుంది.

టాలీవుడ్‌తో పాటుగా విడుదలైన సై రా హిందీ ట్రైలర్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. మొదట్లో సై రాకి హిందీలో క్రేజెంతుందో తెలియక రామ్ చరణ్ అండ్ టీం కంగారు పడినా.. తాజాగా సై రా ట్రైలర్ కొచ్చిన స్పందనతో ఆ టెన్షన్ వదిలేశారు. మరోవైపు సై రా సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో కూడా సైరా ట్రైలర్ తోనే ప్రూవ్ అయ్యింది. తెలుగులోనే కాదు.. సై రా నరసింహారెడ్డి మీద అన్ని భాషల్లోనూ బోలెడంత క్రేజ్ ఉంది. అమితాబ్ నటించడం ఒక ఎత్తైతే... సై రా సినిమా యాక్షన్ సీన్స్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో ఉండడం, యావరేజ్ అనిపించుకున్న సాహో కే పట్టం కట్టిన బాలీవుడ్ జనాలు... ఈ సైరాకి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ పరంగా రికార్డులు కొల్లగొట్టేయ్యడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Sponsored links

Sye Raa Team Happy with Trailer Response:

Good Response to Sye Raa Narasimharedy Trailer

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019