Advertisementt

బాలీవుడ్ సెలబ్రిటీల కోసం స్పెషల్‌గా ‘సైరా’!

Sat 21st Sep 2019 12:13 PM
ram charan,sye raa,special show,bollywood,promotions  బాలీవుడ్ సెలబ్రిటీల కోసం స్పెషల్‌గా ‘సైరా’!
Sye Raa Special Show for Bollywood Celebrities బాలీవుడ్ సెలబ్రిటీల కోసం స్పెషల్‌గా ‘సైరా’!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ కి సైరా రిలీజ్ అన్ని భాషల్లోనూ ఒక ఎత్తైతే.. బాలీవుడ్ లో ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరు స్టామినా వేరే చెప్పక్కర్లేదు. ఇక తమిళం నుండి నయనతార, విజయ్ సేతుపతి.. సైరాలో నటించారు కాబట్టి.. ఆ క్రేజ్ చూసుకోవక్కర్లేదు. అలాగే నయన్ అభిమానులతో పాటుగా... విజయ్ సేతుపతి అభిమానులు కూడా సైరా విడుదల కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. మరో పక్క కన్నడ నటుడు సుదీప్ క్రేజ్ సైరాకి చాలు. ఇక మిగిలిన హిందీ భాషలో ఎంతగా అమితాబ్ నటించినా అక్కడ సైరాకి క్రేజ్ సరిపోదు. అందుకే అక్కడ సైరాని భారీగా ప్రమోట్ చెయ్యాలి. ఇప్పటికే సైరా ట్రైలర్ మీద బాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్ అందరిని ఆకర్షిస్తున్నాయి. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు సైరాని పొగుడుతూ ట్వీటుతున్నారు.

ఇక తాజాగా సైరా టీం బాలీవుడ్‌లో సైరా విడుదలకు ముందే బాలీవుడ్ ప్రముఖులకు ఓ స్పెషల్ షో వెయ్యాలనుకుంటుందట. మరి బాలీవుడ్‌లో ఏ సినిమా రిలీజ్ అయినా.. ముందే సెలెబ్రిటీ షో ఉంటుంది. అలా ఇప్పుడు రామ్ చరణ్ కూడా సైరా సినిమాని ముందే అక్కడ సెలబ్రిటీస్ అందరిని ఆహ్వానించి ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం.

Sye Raa Special Show for Bollywood Celebrities:

Ram Charan Plans Sye Raa Special Show in  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ