పాపం వరుణ్.. పోటీ తప్పడం లేదుగా?

Fri 20th Sep 2019 12:14 PM
varun tej,valmiki,fight,suriya,bandobast  పాపం వరుణ్.. పోటీ తప్పడం లేదుగా?
Varun Tej Valmiki vs Suriya Bandobast పాపం వరుణ్.. పోటీ తప్పడం లేదుగా?
Sponsored links

హరీష్ శంకర్ - వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ ‘వాల్మీకి’ సెప్టెంబర్ 13నే రిలీజ్ కావాలి. కానీ అదే రోజు నాని గ్యాంగ్ లీడర్ ఉండడంతో వాల్మీకి ప్రొడ్యూసర్స్ వెనక్కి తగ్గారు. దాంతో ఈమూవీ సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతుంది. సరే 20న సేఫ్ గా ఉండొచ్చు అనుకుంటే అదే రోజు సూర్య నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బందోబస్త్’ విడుదలవుతోంది. సో వరుణ్ కి సూర్యతో పోటీ తప్పడంలేదు.

అసలే ‘బందోబస్త్’ చిత్రాన్ని నైజాంలో దిల్ రాజు భారీగా రిలీజ్ చేస్తున్నారు. దాంతో థియేటర్స్ కొరత ఏర్పడింది. వాల్మీకికి ఏమాత్రం తేడా టాక్ వచ్చినా కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని ‘వాల్మీకి’ టీమ్‌ని భయపెడుతోందట. ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ తేజ్‌కి ‘బందోబస్త్’ రూపంలో సూర్య విలన్‌గా మారడం విడ్డూరమే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నానితో ఎందుకులే అని పక్కకు తప్పుకుంటే ఇప్పుడు సూర్య వచ్చాడు. కాకపోతే ఇక్కడ వరుణ్ తేజ్ కి కలిసొచ్చే అంశం ఏంటంటే సూర్య ‘బందోబస్త్’కి అసలు బజ్ లేదు. ఏమాత్రం నెగటివ్ టాక్ వచ్చినా వాల్మీకి సేఫ్ అయినట్టే.

Sponsored links

Varun Tej Valmiki vs Suriya Bandobast:

Varun Tej Fights with Suriya

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019