Advertisement

‘ఫీట్ అప్ విత్ ద స్టార్’ గురించి మంచు లక్ష్మి

Fri 20th Sep 2019 12:03 PM
manchu lakshmi,feet up with the stars telugu,stars,night secrets  ‘ఫీట్ అప్ విత్ ద స్టార్’ గురించి మంచు లక్ష్మి
Manchu Lakshmi about Feet Up with The Stars Telugu ‘ఫీట్ అప్ విత్ ద స్టార్’ గురించి మంచు లక్ష్మి
Advertisement

‘ఫీట్ అప్ విత్ ద స్టార్’ మీ ఫేవరేట్ స్టార్స్‌ని మరింత దగ్గర చేస్తుంది: మంచు లక్ష్మి

డిజిటల్ మీడియా రివల్యూషన్ చాలా వినోదాలను అందుబాటులోకి తెస్తుంది. ఎంటర్‌టైన్మెంట్ పరిధులు పెంచుతూ, సరికొత్త వినోదాలను పరిచయం చేస్తుంది. అలాంటి వూట్ అప్  ప్రెజెంట్స్ ‘ఫీట్ అప్ విత్ ద స్టార్’ మంచు లక్ష్మీ హోస్ట్‌గా రాబోతున్న ఈ ఎంటర్‌టైన్మెంట్ షో అనుభవాలు మీడియాతో పంచుకుంది.

ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన షోస్‌లో ఈ ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’ భిన్నమైనది. ఈ షో కోసం స్టార్స్‌ని కలిసినప్పుడు నైట్ డ్రెస్‌లో రమ్మంటే వారిలో కొందరు ఆశ్చర్యపోయారు. కొందరు ఉత్సాహం చూపించారు. బాలీవుడ్‌లో ఈ తరహా షోలు సాధారణమే. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. వాళ్ళ పర్సనల్ విషయాలు ఈ షో తో తెలుస్తాయి. ఇందులో కాంట్రవర్సీలకు తావులేదు. స్టార్స్ నా మీద పెట్టుకున్న భరోసాను చెదరనివ్వలేదు. ఈ షో కి వచ్చే స్టార్స్ చాలా ఇంటర్వ్యూలు చేశారు. టాక్ షోలు, ఈవెంట్స్‌లో మాట్లాడారు. వాళ్ల విషయాలు చాలా తెలుసు అనుకుంటాం. కానీ వారిలో ప్రతి రోజు ఎదో చేంజ్ వస్తుంది. వారి మాటలు, అనుభవాల్లో నుంచీ వస్తాయి. ఉదాహరణకు : సమంతా మనకు చాలా తెలుసు అనుకుంటాం.. కానీ నాగ చైతన్య గురించి ఈ షో లో మాట్లాడిన విషయాలు మీకు సర్ప్రైజ్ గా ఉంటాయి. వరుణ్ తేజ్ ఈ షోలో కొత్తగా కనబడతాడు. చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్. వచ్చిన వాళ్ళందరూ ఈ షో ని బాగా ఎంజాయ్ చేసారు. వాళ్ళ అభిమానులకు మరింత దగ్గర అవుతారు. ఈ షో కంప్లీట్ ఎంటర్‌టైన్మెంట్ వే లో వెళుతుంది. ఈ షో తప్పకుండా బిగ్ సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. ఈ ఎపిసోడ్స్ ఈ నెల 23 నుండి వూట్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ అందుబాటులోకి వస్తుంది’’ అన్నారు.

Manchu Lakshmi about Feet Up with The Stars Telugu:

Manchu Lakshmi Latest Interview

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement