బెల్లంకొండ శ్రీనివాస్ ఇకపై నో మాస్..!

Fri 20th Sep 2019 11:47 AM
bellamkonda srinivas,rakshasudu,different stories,bellamkonda sai srinivas  బెల్లంకొండ శ్రీనివాస్ ఇకపై నో మాస్..!
Change in Bellamkonda Srinivas Mindset బెల్లంకొండ శ్రీనివాస్ ఇకపై నో మాస్..!
Sponsored links

బెల్లంకొండ శ్రీనివాస్ మొన్నటివరకు చేతికి ఎటువంటి సినిమా వస్తే అది ఏమి ఆలోచించకుండా చేసేవాడు. ‘రాక్షసుడు’ ముందు చిత్రం ‘సీత’ వరకు అన్ని మాస్‌ చిత్రాలే చేసినా శ్రీనివాస్ ‘రాక్షసుడు’ సినిమాతో ఇక మాస్ చిత్రాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీనివాస్ తన తరువాత చిత్రాలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉండే విధంగా మంచి చిత్రాలు చేయాలనీ నిర్ణయించుకున్నాడు.

అసలే మనోడి రేంజ్‌లో చాలామంది హీరోస్ ఉన్నారు. ఏమాత్రం శ్రీనివాస్ గ్యాప్ ఇచ్చినా చాలు దూరి వెళ్లిపోవడానికి రెడీగా ఉన్నారు. చాలామంది హీరోస్ రెగ్యులర్ కథలకు దూరంగా ఉండి వెరైటీ చిత్రాలు వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ ఒత్తిడి బెల్లంకొండపై పడడంతో ఆయన మాస్ సినిమాలని దూరం పెట్టనున్నాడు. ప్రస్తుతం అన్ని డిఫరెంట్‌గా ఉండే కథలే వింటున్నాడంట. మనోడికి హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎలాగో నిర్మాతలు తనతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మార్కెట్ పడిపోకుండా చూసుకోవడం మాత్రం తన చేతుల్లోనే వుందని తెలుసుకున్నాడు బెల్లంకొండ. చూద్దాం నెక్స్ట్ ఎటువంటి సినిమాలు చేస్తాడో..!

Sponsored links

Change in Bellamkonda Srinivas Mindset:

Bellamkonda Srinivas wants Different Stories

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019