స‌మంతనే సీక్రెట్‌ను రివీల్ చేసేసింది.!!

Thu 19th Sep 2019 04:09 PM
samantha akkineni,beauty,tollywood,secrets  స‌మంతనే సీక్రెట్‌ను రివీల్ చేసేసింది.!!
Samantha Reveals Secret Over Her...! స‌మంతనే సీక్రెట్‌ను రివీల్ చేసేసింది.!!
Sponsored links

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నదెవరు? అంటే టక్కున అక్కినేని కోడలు స‌మంత గుర్తొస్తుంది. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఈమె అందం, అభినయంలో ఏ మాత్రం మార్పులు రాలేదు. అందం విషయంలో మాత్రం సమంత చాలా జాగ్రత్తలు పాటిస్తోంది. మరీ ముఖ్యంగా పెళ్లాయ్యాక మరింత డోస్ పెంచిన సామ్.. మరింత అందంగా కనపడుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మీ అందం రహస్యంటి..? అనే ప్రశ్న ఎదురవ్వగా ఆసక్తికర సమాధానమిచ్చింది.

తన బ్యూటీ అంతా ఈ భామ బ్యాగ్‌లోనే కిట్ దాచుకుంద‌ట‌. ‘ఎన్ని ప‌నులున్నా.. ఎంత బిజీగా ఉన్నా  క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్తాను. ఇక మార్షల్ ఆర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న ఆమె ఏ సింబ‌ల్ అయినా అవ‌లీల‌గా చేసేస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను.. సినిమా షెడ్యూల్స్ లేక‌పోతే ఎక్కువుగా జిమ్‌లోనే గ‌డిపేస్తుంటాను’ అని చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. అన్నం, సాంబార్‌, చికెన్‌, ఫిష్‌, స్వీట్‌ పొంగల్‌తో పాటు ఫిల్టర్‌ కాఫీ, ప్రోటీన్లు ఎక్కువ ఉండే ఆహారం, అధిక నీరు, తాజా కూరగాయలు, కొబ్బరి నీరు డైట్‌లో ఉండేలా సమంత చూసుకుటుందట. మొత్తానికి చూస్తే.. సామ్ తన బ్యూటీ సీక్రెట్‌ను తానే బయటపెట్టుకుందన్న మాట.

Sponsored links

Samantha Reveals Secret Over Her...!:

Samantha Reveals Secret Over Her...!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019