ప్రియుడికి లేడీ సూపర్‌స్టార్ సింపుల్ పార్టీ!

Thu 19th Sep 2019 03:44 PM
nayanatara,lovers,vishnu,love,birth day  ప్రియుడికి లేడీ సూపర్‌స్టార్ సింపుల్ పార్టీ!
Nayanatara Gives Simple Party To Lover Vishnu!! ప్రియుడికి లేడీ సూపర్‌స్టార్ సింపుల్ పార్టీ!
Sponsored links

స్టార్ హీరోయిన్ కమ్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయనతార- విఘ్నేష్ శివన్ ప్రేమ పక్షులన్న సంగతి తెలిసిందే. కాస్త గ్యాప్ దొరికితే చాలు ఈ జంట రెక్కలు కట్టుకుని విదేశాలకు టూర్ వెళ్లిపోతుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గతం గత: అన్నట్లుగా పాస్ట్‌ను అంతా వదలేసిన నయన్.. కొత్త ప్రియుడు విఘ్నేష్‌ను బాగా నమ్మి పిచ్చాపాటిగా ఎంజాయ్ చేసేస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లిపీటలెక్కుతుందా లేదా..? అనేది పైనున్న దేవుడెరుగు.

ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల విఘ్నేష్ శివన్ పుట్టినరోజు గ్రాండ్‌గా జరుపుకున్నాడు. అంతేకాదు.. ఈ వేడుక ఇండియాలోని ఉండి గ్రాండ్ జరుపుకోవడం మామూలు విషయం కాదు. గడిచిన రెండేళ్లుగా ప్రియుడు పుట్టిన రోజున విదేశాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేదీ ఈ అందాల సుందరి.. ఈసారి మాత్రం ఇండియాలోనే మరీ గ్రాండ్‌గా కాకుండా సింపుల్‌గానే వేడుకలు పూర్తి చేసేసింది.  

అయితే.. చిన్నపాటి గ్యాప్ దొరికితే చాలు విదేశాలకు చెక్కేసీ ఈ జంట.. ఇంత సింపుల్‌గా వేడుకలేంటి..? ఈ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిందా..? ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయా..? అనే కొత్త పుకార్లు వస్తున్నాయి. వాస్తవానికి ఇద్దరూ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. అందుకే ఇలా సింపుల్‌గా.. అది కూడా ఇండియాలో ప్రేమ పక్షులు పుట్టిన రోజు వేడుకలు పూర్తి చేశాయి.

Sponsored links

Nayanatara Gives Simple Party To Lover Vishnu!!:

Nayanatara Gives Simple Party To Lover Vishnu!!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019