‘డ‌స్ట‌ర్‌1212’ ఫ‌స్ట్ లుక్ విడుదల

Wed 18th Sep 2019 01:46 PM
hero srikanth,duster 1212,first look,launches  ‘డ‌స్ట‌ర్‌1212’ ఫ‌స్ట్ లుక్ విడుదల
Duster 1212 First Look Released ‘డ‌స్ట‌ర్‌1212’ ఫ‌స్ట్ లుక్ విడుదల
Sponsored links

హీరో శ్రీ‌కాంత్ చేతుల మీదుగా ‘డ‌స్ట‌ర్‌ 1212’ ఫ‌స్ట్ లుక్ లాంచ్‌

శుభ‌కరి క్రియేష‌న్స్ ప‌తాకంపై వాల్మికీ ఫేమ్ అథ‌ర్వా హీరోగా న‌టించిన చిత్రం డ‌స్ట‌ర్‌1212. బ‌ద్రీ వెంక‌టేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి మ‌రిపి విద్యాసాగ‌ర్ (విన‌య్‌) నిర్మిస్తున్నారు. అనైకాసోటి మిస్తీ హీరోయిన్‌గా ఇంకా త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను హీరో శ్రీ‌కాంత్  ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...

హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ... డస్ట‌ర్ 1212 టీమ్‌కి నా ప్ర‌త్యేక  అభినంద‌న‌లు. అథ‌ర్వ హీరోగా న‌టిస్తున్నారు. చాలా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. అథ‌ర్వా ముర‌ళీగార‌బ్బాయి. ముర‌ళీ  గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు గ‌తంలో ‘హృదయం’  చిత్రంతో అంద‌రికీ ప‌రిచ‌య‌మున్న‌ వ్య‌క్తి. వాళ్ళ అబ్బాయి హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో విడుద‌ల‌వ‌బోతుంది. ప్రొడ్యూస‌ర్ విన‌య్‌గారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. త‌మిళ‌నాడులో మంచి పెద్ద హిట్ అయింద‌నే టాక్ కూడా ఉంది. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను. గ‌తంలో తెలుగులో విడుద‌లై  హిట్ అయిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు ఆడియ‌న్స్ అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అని అన్నారు.

ప్రొడ్యూస‌ర్ విన‌య్ మాట్లాడుతూ... నా పేరు విన‌య్. శుభ‌క‌రి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఇది మా రెండో చిత్రం. త‌మిళంలో అథ‌ర్వా ముర‌ళీగారు న‌టించిన చిత్రం. ఇది ఒక బ్యాచ‌ల‌ర్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి య‌దార్ధ‌గాధ‌. ఈ రోజు శ్రీ‌కాంత్‌గారి చేతుల మీదుగా మా సినిమా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాం. ఇందులో జి.కె.రెడ్డి(హీరో విశాల్ ఫాద‌ర్‌) ముఖ్య పాత్ర వహించారు. క‌రుణాక‌ర‌న్, మ‌నోబాల కామెడీ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్టోబ‌ర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాము. ఇందులో 

న‌టీన‌టులు: అథ‌ర్వా, అనైకాసోటి మిస్తీ,  దేవ‌ద‌ర్శిని, జి.కె.రెడ్డి(హీరో విశాల్ ఫాద‌ర్‌), ఎం.ఎస్‌. భాస్క‌ర్‌, మ‌నోబాల‌, యోగిబాబు, ఆదుక‌ల‌మ్‌న‌రేన్‌, రంజిత్‌, క‌రుణాక‌ర‌న్‌,  రెమీ కార్తికేయ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సాంకేతిక నిపుణులుః

డైరెక్ట‌ర్: బ్ర‌ది వెంక‌టేష్‌, ప్రొడ్యూస‌ర్: మ‌రిపి విద్యాసాగ‌ర్‌(విన‌య్‌)  డైలాగ్స్: రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, మ్యూజిక్: యువ‌న్‌శంక‌ర్‌రాజా, ఎడిట‌ర్: ప్ర‌వీణ్‌కె.ఎల్‌, సినిమాటోగ్ర‌ఫీ: గోపి అమర్నాథ్.

Sponsored links

Duster 1212 First Look Released:

Srikanth launches Duster 1212 First Look

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019