నాని క్రేజ్: యావరేజ్ వస్తే చాలు హిట్టే!

Wed 18th Sep 2019 02:07 PM
nani,repeats,mca strategy,gang leader  నాని క్రేజ్: యావరేజ్ వస్తే చాలు హిట్టే!
Nani gets one more Hit with Gang Leader నాని క్రేజ్: యావరేజ్ వస్తే చాలు హిట్టే!
Sponsored links

నాని సినిమాలు ఒకప్పుడు వరస హిట్స్ ఉండడంతో.. ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. దాదాపుగా ఆరేడు హిట్స్ వరసగా కొట్టాడు. దానితో నాని సినిమాల మీద ప్రేక్షకులు ఓ అంచనాకి వచ్చేసారు. నాని సినిమాకి యావరేజ్ వచ్చినా.. సినిమా చూసేందుకు బావుంటుంది అని. గతంలో నాని నటించిన MCA మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా విషయంలో.. క్రిటిక్స్ అంతా కలిసి యావరేజ్ రేటింగ్స్ ఇవ్వగా ప్రేక్షకులు సినిమాని సూపర్ హిట్ చేశారు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన MCA  ఫ్యామిలీస్ కి కనెక్ట్ అవడంతో సినిమాకి దుమ్ము దులిపే కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా నాని గ్యాంగ్ లీడర్ విషయంలోనూ అదే జరిగింది.

గత శుక్రవారం విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా మొదటి షోకే క్రిటిక్స్ మొత్తం యావరేజ్ రేటింగ్స్ ఇచ్చారు. అయితే మొదటి రోజు పర్వాలేదనిపించే ఓపినింగ్స్ తెచ్చుకున్న గ్యాంగ్ లీడర్ ఫస్ట్ వీకండ్ లో నాని క్రేజ్ తో సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్ సాధించింది. నాని నేచురల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవడంతో ఆయన సినిమాలకు యావరేజ్ టాక్ పడినా.. సినిమాకి కలెక్షన్స్ ఓ రేంజ్ లో రాస్తున్నాయి. గ్యాంగ్ లీడర్ ని మైత్రి మూవీస్ వారు నిర్మించారు. వాల్మీకి సినిమా థియేటర్స్ లోకి దిగేసరికి నాని తన క్రేజ్ తో గ్యాంగ్ లీడర్ సినిమాకి బ్రేక్ ఈవెన్ తీసుకురావడం ఖాయం. 

Sponsored links

Nani gets one more Hit with Gang Leader:

Nani Repeats MCA Strategy with Gang Leader

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019