ప్రభాస్‌కు పోటీగా వస్తున్న బన్నీ...!!

Mon 16th Sep 2019 06:38 PM
bunny,competition,prabhas,bollywood,tollywood  ప్రభాస్‌కు పోటీగా వస్తున్న బన్నీ...!!
Bunny Gives Competition To Prabhas.. why Here..!! ప్రభాస్‌కు పోటీగా వస్తున్న బన్నీ...!!
Sponsored links

ఇదేంటి యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ను.. కొంపదీసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ‘ఢీ’ కొడుతున్నాడా ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అస్సలు కాదండోయ్.. ప్రభాస్‌ను చూసి ఆయన బాటలోనే బన్నీ కూడా నడవాలని డిసైడ్ అయ్యాడట. ఈ వ్యవహారం ఏంటో కాస్త నిశితంగా ఈ కథనంలో చూద్దాం.

ప్రభాస్‌కు బాలీవుడ్‌లో మార్కెట్ ఓ రేంజ్‌లో ఉంది. ‘సాహో’ రిలీజ్ తర్వాత సినిమాకు వచ్చిన టాక్, కలెక్షన్స్ ఈ విషయాన్ని నిజం చేశాయి. ఏదైనా సరే పోటీ ఉంటే కాస్త కిక్కు ఉంటుంది కదా అని భావించిన బన్నీ.. తాను కూడా బాలీవుడ్‌లో చేసి ప్రభాస్‌లాగే అక్కడి సినీ ప్రియుల మెప్పు పొందాలని భావిస్తున్నాడట. అందుకే అన్నీ అనుకున్నట్లు జరిగితే తొందర్లోనే బాలీవుడ్‌లో ఓ రాయి వేయాలని యోచిస్తున్నాడట.

అందుకే మొదట.. వేణు శ్రీరామ్ వినిపించిన ‘ఐకాన్’ స్క్రిప్ట్‌ను బాలీవుడ్ జనాలకు కూడా నచ్చేలా మార్పులు చేర్పులు చేయాలని సూచించాడట. ఆ మార్పులకు కాస్త టైమ్ పడుతుందని.. ఆ లోపు సుకుమార్‌తో సినిమా చేసేస్తే పోలా అని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. బన్నీ సినిమాలన్నీ హిందీ డబ్బింగ్‌‌లో మిలియన్లలో వ్యూస్ వస్తుండటంతో.. డబ్బింగ్ ఎందుకు ‘మనమే సినిమా చేసేస్తే పోలా’ అని ఫిక్స్ అయ్యాడట. ఈ ప్లాన్స్ ఏ మేరకు వర్కవుట్ అవుతాయో..? ఈ వార్తల్లో ఏ మాత్రం నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే మరి.

Sponsored links

Bunny Gives Competition To Prabhas.. why Here..!!:

Bunny Gives Competition To Prabhas.. why Here..!!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019