ముగ్గురు టాప్ నిర్మాతల టార్గెట్ జనవరి 10!

Wed 11th Sep 2019 04:15 PM
producers,target,sarileru neekevvaru,ala vaikuntapuramlo,darbar,sankranthi,jan 10  ముగ్గురు టాప్ నిర్మాతల టార్గెట్ జనవరి 10!
Sarileru Neekevvaru vs Ala Vaikuntapuramlo vs Darbar ముగ్గురు టాప్ నిర్మాతల టార్గెట్ జనవరి 10!
Sponsored links

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ నుండి రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి మహేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ కాగా, అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ అవుతున్నాయి. కరెక్ట్‌గా సంక్రాంతి పండగకు రిలీజ్ చేద్దాం అనుకుంటే ఆ రోజు మంగళవారం కావడంతో కొంచం ముందుగానే వస్తే వీకెండ్ కూడా కలిసొచ్చే అవకాశముందని భావిస్తున్నారు ఆయా సినిమాల నిర్మాతలు.

అందుకే రెండు సినిమాల నిర్మాతలు జనవరి 10 డేట్‌ పై పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగకు సెలవలు ఉంటాయి కాబట్టి ఏ రోజు రిలీజ్ చేసినా పెద్ద తేడా ఉండదు. కానీ ఓవర్సీస్‌ మార్కెట్‌లో వసూళ్లు రావాలంటే వీకెండ్ ‌కే సినిమాలు రావాలి. అసలే మహేష్‌-అనిల్‌ రావిపూడి సినిమా, మరోవైపు అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ కావడంతో రెండూ ఓవర్సీస్‌ మార్కెట్‌లో హాట్‌ చిత్రాలే.

అందుకే ఏ నిర్మాత అక్కడ మార్కెట్‌ని కోల్పోవడానికి అంగీకరించడం లేదు. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య డైరెక్ట్‌ క్లాష్‌ లేదా వన్‌ డే గ్యాప్‌ వుంటుందనిపిస్తోంది. అందుకే జనవరి 10 డేట్‌ హాట్‌గా మారింది. ఇక ఈ రెండు చిత్రాలతో పాటు రజినీకాంత్ ‘దర్బార్‌’ కూడా అదే డేట్‌ని టార్గెట్‌ చేస్తున్నట్టు తెలిసింది. ఆ డేట్ కే రావాలని మూడు సినిమాల నిర్మాతలు కంకణం కట్టుకుని కూర్చున్నారు. తమ ప్రాజెక్ట్స్‌పై నమ్మకంతో ఎవరూ వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది.

Sponsored links

Sarileru Neekevvaru vs Ala Vaikuntapuramlo vs Darbar:

3 top Producers Targes Jan 10th date

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019