‘సైరా’ని అక్కడ తక్కువకే అమ్మేశారు

Wed 11th Sep 2019 04:06 PM
sye raa,overseas,business,ram charan,saaho,chiranjeevi,mega star  ‘సైరా’ని అక్కడ తక్కువకే అమ్మేశారు
Sye Raa USA Break Even Target Is Set ‘సైరా’ని అక్కడ తక్కువకే అమ్మేశారు
Sponsored links

సాహో లాంటి భారీ చిత్రం తరువాత మన టాలీవుడ్ నుండి సైరా వస్తుంది. దాదాపు 250 కోట్లు ఖర్చుతో రూపొందిన ఈమూవీ అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవికి మంచి మార్కెట్ ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈమూవీని సాహోకి సమానంగా విక్రయిస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో ఈచిత్రాన్ని అనుకున్న దానికంటే కంటే చాలా తక్కువకి అమ్మారు మేకర్స్.

ఓవర్సీస్‌ రైట్స్‌ కేవలం పద్దెనిమిది కోట్లకే అమ్మేసారు. అమెరికాలో ఈ చిత్రం చాలా చోట్ల రికవరీ అయ్యే అవకాశముంది. ఒకవేళ యావరేజ్ టాక్ వచ్చినా కానీ అది రికవరీ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇక సూపర్ హిట్ అని టాక్ వస్తే అక్కడ ఈ చిత్రంను కొన్న డిస్ట్రిబ్యూటర్ కి కాసుల పంటే. ఒకవేళ సినిమా అంచనాలని అందుకోవడంలో విఫలమయినా కానీ ఈ రేట్‌ వల్ల రిస్క్‌ ఫ్యాక్టర్‌ తగ్గుతుంది.

సాహో చిత్రాన్ని చాలా ఎక్కువకి అమ్మడంతో అక్కడ సాహో చిత్రానికి అన్ని వెర్షన్లకీ కలిపి నార్త్‌ అమెరికాలో మూడు మిలియన్లు వచ్చినా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కి దాదాపు రెండు మిలియన్ల మేర నష్టమొస్తున్నట్టు ట్రేడ్‌ సర్కిల్స్‌ అంచనా వేస్తున్నాయి. అందుకే సైరా ఒక అడుగు ముందుకు ఆలోచించి అమెరికాలో తక్కువ రేట్‌కి అమ్మారు.

Sponsored links

Sye Raa USA Break Even Target Is Set:

Sye Raa Overseas Business Details

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019