Advertisement

గోపీచంద్ ‘చాణ‌క్య‌’ టీజ‌ర్: యాక్ష‌న్ ప్యాక్‌డ్

Wed 11th Sep 2019 01:52 PM
chanakya teaser,gopichand,chanakya,mehreen,action packed  గోపీచంద్ ‘చాణ‌క్య‌’ టీజ‌ర్: యాక్ష‌న్ ప్యాక్‌డ్
Gopichand Chanakya Teaser Released గోపీచంద్ ‘చాణ‌క్య‌’ టీజ‌ర్: యాక్ష‌న్ ప్యాక్‌డ్
Advertisement

గోపీచంద్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం ‘చాణక్య‌’. బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్ల‌ర్ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఈ ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా టీజ‌ర్‌ను సోమ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. యాక్ష‌న్ ప్యాక్‌డ్ టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన గోపీచంద్ లుక్‌, పోస్ట‌ర్స్‌తో పాటు ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్‌తో అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

Click Here for Teaser

నటీనటులు:

గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు

సాంకేతిక వర్గం:

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు

ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి

కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర

మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి

రైటర్: అబ్బూరి రవి

ఆర్ట్: రమణ వంక

కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్

పి.ఆర్.ఓ: వంశీ శేఖర్

Gopichand Chanakya Teaser Released:

Chanakya Teaser: Action Packed

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement