‘అల..’ హాట్ కేకులా అమ్ముడైంది

Fri 06th Sep 2019 02:44 PM
ala vaikuntapuramlo,business,allu arjun,trivikram srinivas  ‘అల..’ హాట్ కేకులా అమ్ముడైంది
Ala Vaikuntapuramlo Movie Satellite and Digital Rights Sold out ‘అల..’ హాట్ కేకులా అమ్ముడైంది
Sponsored links

త్రివిక్రమ్ సినిమాలకు థియేటర్స్‌లోకన్నా ఎక్కువగా బుల్లితెర మీద సక్సెస్ అవుతాయని అందరికీ తెలుగు. అత్తారింటికి దారేది, అ...ఆ లాంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయం సాధించాయి. త్రివిక్రమ్ సినిమాలకు క్రేజ్ ఎక్కువ ఉండేది బుల్లితెర మీదే. ఇక తాజాగా అల్లు అర్జున్ తో మూడో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఈ సినిమాకి అదిరిపోయే టైటిల్ పెట్టాడు. అలా వైకుంఠపురములో అంటూ అందరిని ఆకట్టుకునే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా టబు.. కీ రోల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఆ అంచనాలతోను, త్రివిక్రమ్ - అల్లు అర్జున్ క్రేజ్‌తోనూ అలా వైకుంఠపురములో డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులు భారీ ధరకు ఆమ్ముడుపోయాయని సమాచారం. ‘అల వైకుంఠపురములో’ డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కుల కోసం సన్ నెక్స్ట్, జెమిని వారు పోటీ పడి భారీ ధరకు రెండు హక్కులను దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు. మరి ఎప్పటిలాగే త్రివిక్రమ్ సినిమాలకు బుల్లితెర హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడ్డట్టే ఇపుడు అలా వైకుంఠపురములో కోసం కూడా భారీ పోటీ నడిచింది. కానీ చివరికి జెమిని టివి వారు భారీ ధర వెచ్చించి హక్కులను దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది.

Sponsored links

Ala Vaikuntapuramlo Movie Satellite and Digital Rights Sold out:

Ala Vaikuntapuramlo Business Details

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019