‘సాహో’కి ఈ వారం కూడా తిరుగులేనట్టే?

Saaho Movie Second Week Update

Fri 06th Sep 2019 02:21 PM
Advertisement
competition,saaho,second week,prabhas,jodi,2 hours love  ‘సాహో’కి ఈ వారం కూడా తిరుగులేనట్టే?
Saaho Movie Second Week Update ‘సాహో’కి ఈ వారం కూడా తిరుగులేనట్టే?
Advertisement

అసలే ప్లాప్ టాక్.. నిన్నమొన్నటివరకు కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించిన సాహోకి వీక్ డేస్ మొదలవ్వగానే వీక్ అవడం మొదలైపోయింది. మొదటి నాలుగు రోజులు టాక్‌తో సంబంధమే లేకుండా సాహో కలెక్షన్స్ ఇరగదీసాయి. కానీ వీక్ డేస్‌లో సాహో ప్రభంజనం మొత్తం తుస్ మంది. ఇక సాహో సినిమాని కొన్న బయ్యర్లకు టెన్స్ పట్టుకుంది. కొన్ని ఏరియాలలో సాహో కలెక్షన్స్ ముందు నుండి బావున్నాయి. కానీ కొన్ని ఏరియాలలో సాహో మొదటి నుండి ప్లాప్ టాక్‌తో డల్ కలెక్షన్స్‌తోనే ఉంది. ఇక సాహోకి భయపడి మీడియం బడ్జెట్ సినిమాలన్నీ పోస్ట్ పోన్ చేసుకున్నాయి.

ఇక సాహోకి రెండో వారమైన కలిసొస్తుంది అనుకున్నారు. ఎందుకంటే ఈ శుక్రవారం కేవలం చిన్న చిన్న సినిమాలు తప్ప సాహో కి ఎదురు నిలిచే సినిమాలేవీ విడుదల కావడం లేదు. మరి నెగెటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో రన్ అయిన సాహో రెండో వారంలో తన హవా సాగిస్తుందేమో అంటున్నారు. ప్రభాస్ క్రేజ్ పని చేసి ఈ వారం విడుదల కాబోతున్న చిన్న సినిమాలు 2 హవర్స్ లవ్, జోడి, ఉండిపోరాదే, నీకోసం, వీడే సరైనోడు లాంటి సినిమాలేవీ సాహో కి ఎదురు నిలవలేవు. కాకపోతే ఈ సమయాన్ని సాహో ఎలా వాడుకుంటాడో చూడాలి. ఎందుకంటే.. ఓసారి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాక మళ్ళీ పికప్ అవడం.. అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

Advertisement

Saaho Movie Second Week Update:

No Movie Competition to Saaho at Second Week

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement