పరశురామ్ నెక్స్ట్ హీరో అతనే..!

Mon 26th Aug 2019 03:23 PM
parasuram,next film,akhil akkineni  పరశురామ్ నెక్స్ట్ హీరో అతనే..!
Parasuram next Film Hero Confirmed పరశురామ్ నెక్స్ట్ హీరో అతనే..!
Sponsored links

పరుశురామ్ తన మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన గీత గోవిందం వరకు అన్ని మంచి సినిమాలే తీసాడు. కానీ అతనికి అవకాశాలు త్వరగా రావు. గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరుశురామ్ తన తరువాత సినిమా కోసం చాలా టైం తీసుకున్నాడు. ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్లాన్ చేద్దాం అనుకున్నాడు. కానీ అది ఎందుకో సెట్ అవ్వలేదు. అలానే బన్నీతో కూడా ఓ సినిమా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి కానీ ఇది ఫైనల్ అవ్వలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం పరుశురామ్ – అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందట. రీసెంట్ గా ఈ డైరెక్టర్ కి అఖిల్ ఒక లైన్ చెప్పినట్టు తెలుస్తుంది. కథ విన్న నాగ్ అండ్ అఖిల్ ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారట. అయితే పరుశురామ్ కొన్ని రోజులు కిందట స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసాడట. త్వరలోనే ఈమూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. నిజానికి ఈమూవీని అల్లు అరవింద్ నిర్మించాలి కానీ నాగ్ నిర్మిస్తున్నట్టు టాక్. ప్రస్తుతం అఖిల్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈమూవీ తరువాత అఖిల్, పరుశురామ్ తో చేసే అవకాశముంది. అయితే దీనిపై అధికార ప్రకటన రానుంది.

Sponsored links

Parasuram next Film Hero Confirmed:

Parasuram Next Film with Akhil Akkineni

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019