బల్గేరియాలో ఛేజింగ్ చేస్తున్న ఎన్టీఆర్!

Mon 26th Aug 2019 03:07 PM
rrr,shooting,bulgaria,latest,update  బల్గేరియాలో ఛేజింగ్ చేస్తున్న ఎన్టీఆర్!
RRR Shooting Latest Update బల్గేరియాలో ఛేజింగ్ చేస్తున్న ఎన్టీఆర్!
Sponsored links

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం RRR. భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైపోయింది. ఇద్దరు స్టార్ హీరోలు, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురు ఈ సినిమాలో చేస్తుండటంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే సినిమాకు సంబంధించి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఇటు జూనియర్ ఫ్యాన్స్ .. అటు రామ్‌ చరణ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

భారీ యాక్షన్ సీన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ బల్గేరియా వెళ్ళాడు. ఇటీవలే తన తండ్రి సంవత్సరికం పూర్తి చేసుకున్న జూనియర్.. బల్గేరియాకు వెళ్లాడు.. అక్కడే నెలరోజుల పాటు షూట్ జరగనుందని సమాచారం. జూనియర్‌తో పాటు కొంతమంది ఫైటర్‌లపై భారీ ఎత్తున ఫైటింగ్ సీన్స్‌తో పాటుగా ఛేజింగ్ సీన్స్‌ను జక్కన్న తీస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా.. బల్గేరియాలో జరుగుతున్న షూటింగ్‌లో ఎన్టీఆర్ మాత్రమే పాల్గొంటున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్రీకి షూట్ లేదు గనుక.. ఎంచక్కా సైరా నర్సింహారెడ్డి ప్రమోషన్స్‌లో పాల్గొనచ్చన్న మాట.

Sponsored links

RRR Shooting Latest Update:

RRR Shooting at Bulgaria

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019