రౌడీ పోయాడు.. ఇక ‘రైతు’గా శర్వా!

Sun 25th Aug 2019 07:53 PM
sharwanand,rythu,farmer,srikaaram movie,chiru,mahesh  రౌడీ పోయాడు.. ఇక ‘రైతు’గా శర్వా!
Sharwa following Chiranjeevi, Mahesh Babu రౌడీ పోయాడు.. ఇక ‘రైతు’గా శర్వా!
Sponsored links

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రధానపాత్రలో వచ్చిన ‘రణరంగం’ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లాపడ్డ విషయం విదితమే. ఎప్పుడూ డిఫరెంట్ పాత్రలు చేయడానికి ముందు వరుసలో శర్వా.. రౌడీగా నటించి అడ్రస్ లేకుండా పోయాడు.. అయితే ఈసారి ‘రైతు’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ‘శ్రీకారం’ మూవీలో ఈ డిఫరెంట్‌ రోల్‌లో శర్వా నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ‘ఖైదీ నెంబర్ 150’, ‘మహర్షి’ తర్వాత మరోసారి రైతు గురించి ఈ చిత్రంలో చక్కగా చూపించబోతున్నారని టాక్.

కిషోర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కాగా ఈ చిత్రం షూటింగ్ మొత్తం తిరుపతి, అనంతపురం, గోదావరి జిల్లాల్లో ఉంటుందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్లో షూటింగ్‌కు ‘శ్రీకారం’ చుట్టాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. కాగా శర్వా ప్రస్తుతం తమిళంలో సూపర్ డూపర్ హిట్టయిన ‘96’ చిత్రం రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Sponsored links

Sharwa following Chiranjeevi, Mahesh Babu:

Talented Actor turns Rythu 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019