సాహో ప్ర‌భాస్ సాహో: ‘తూనీగ’ చిత్ర బృందం

Sun 25th Aug 2019 07:46 PM
saaho,prabhas,tooneega team,greetings,wishes,srikakulam,saaho movie  సాహో ప్ర‌భాస్ సాహో: ‘తూనీగ’ చిత్ర బృందం
Tooneega Team Wishes To Saaho సాహో ప్ర‌భాస్ సాహో: ‘తూనీగ’ చిత్ర బృందం
Sponsored links

శ్రీ‌కాకుళం : త్వ‌ర‌లో విడుద‌ల కానున్న భారీ బ‌డ్జెట్ చిత్రం, స‌రికొత్త దృశ్య ప్ర‌పంచం సాహో విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటూ, చిత్ర క‌థానాయకుడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కు శుభాకాంక్ష‌లు చెబుతూ తూనీగ చిత్ర బృందం ప్ర‌త్యేకంగా ఓ పోస్ట‌ర్ ను సామాజిక మాధ్య‌మాల ద్వారా విడుద‌ల చేసి త‌న అభిమానం చాటుకుంది. ఈ పోస్ట‌ర్ రూప‌క‌ల్ప‌న చేసిన తీరుపై శ్రీ‌కాకుళం న‌గ‌ర ప్ర‌భాస్ ఫ్యాన్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు జి.సూర్యనారాయ‌ణ ఎంతో ఆనందం వ్య‌క్తం చేశారు. బాహుబ‌లిని మించి ఈ సినిమా విజయ‌వంతం కావాల‌ని ఈ సందర్భంగా తూనీగ చిత్ర ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీమ్ ఆకాంక్షించారు.

అన్ని రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం దిద్దుతూ సినిమా సంచ‌ల‌న విజయం న‌మోదు చేయాల‌ని, ఇటువంటి విజువ‌ల్ వండ‌ర్స్ మ‌రిన్ని యూవీ క్రియేష‌న్స్ నుంచి రావాల‌ని ఆకాంక్షించారు. సాహ‌సానికి కేరాఫ్‌గా నిలుస్తూ పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమా అటు ఉత్త‌రాదినీ, ఇటు దక్షిణాదినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుని, బాక్సాఫీస్ బొనాంజాగా నిల‌వాల‌ని కోరుకుంటూ ఓ ప్ర‌కట‌న విడుద‌ల‌ చేశారు. అదేవిధంగా విక్ట‌రీ వెంక‌టేశ్ - రానా ఫ్యాన్స్ స్టేట్ ఆర్గ‌నైజ‌ర్ రౌతు సూర్యనారాయ‌ణ, శ్రీ‌కాకుళం ఫిల్మ్ క్ల‌బ్ నిర్వాహ‌కులు ర‌మేశ్ నారాయ‌ణ్ చిత్ర విజ‌యాన్ని కాంక్షించారు. ఈ డిజిట‌ల్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ చిత్ర‌కారులు గిరిధ‌ర్ అర‌స‌వ‌ల్లి రూపొందించారు.

Sponsored links

Tooneega Team Wishes To Saaho :

Tooneega Team released Poster about Saaho Success 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019