అప్పుడేమో రశ్మిక జపం.. మరి ఇప్పుడు..?

Sat 24th Aug 2019 10:39 PM
rashmika mandanna,dear comrade,heroes,heroine,rashmika mandanna movies,sarileru neekevvaru,bheeshma  అప్పుడేమో రశ్మిక జపం.. మరి ఇప్పుడు..?
Heroes not interested on Rashmika Mandanna అప్పుడేమో రశ్మిక జపం.. మరి ఇప్పుడు..?
Sponsored links

‘ఛలో, గీత గోవిందం’ హిట్స్ తర్వాత రశ్మికా పేరు టాలీవుడ్‌లో ఒక్కసారిగా మార్మోగిపోయింది. గీత గోవిందం హిట్ తర్వాత కెరీర్ ముఖ్యమని భవించిన రశ్మికా ఎంగేజ్మెంట్ ని కూడా క్యాన్సిల్ చేసుకుంది. దేవదాస్ సినిమా యావరేజ్ అయినా.. డియర్ కామ్రేడ్‌తో హిట్ కొట్టాలనుకుంది. విజయ్ దేవరకొండతో కలిసి భీభత్సంగా ప్రమోషన్స్‌లోనూ పాల్గొంది. కానీ డియర్ కామ్రేడ్ సినిమా రశ్మికకే కాదు విజయ్ దేవరకొండ క్రేజ్‌కి బ్రేకులు వేసింది. ఇక విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలు ఇప్పటికే డైలమాలో పడ్డాయి. కానీ రశ్మికా, మహేష్ తో సరిలేరు నీకెవ్వరు అనే బిగ్ ప్రాజెక్ట్ లో నటించడమే కాదు.. నితిన్‌తో భీష్మలో కూడా నటిస్తుంది.

అందంగా ఉన్నప్పటికీ.. గ్లామర్ లుక్స్ అంతంతమాత్రంగా వున్న రశ్మికకి లక్కు బాగా కలిసొచ్చి వరుస హిట్స్ పడ్డాయి. అందుకే మహేష్ లాంటి హీరో చూపు రశ్మిక మీద పడింది. అయితే డియర్ కామ్రేడ్ కి ముందు రశ్మికా జపం చేసిన చాలామంది దర్శక నిర్మాతలు డియర్ కామ్రేడ్ తర్వాత రశ్మికా గురించి లైట్ తీసుకున్నారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మరింది. డియర్ కామ్రేడ్‌లో లిల్లీ గా సూపర్ గా నటించినా.. ఆ సినిమా ప్లాప్ ఎఫెక్ట్ హీరో విజయ్ తో పాటుగా రశ్మిక మీద కూడా సరిసమానంగా పడిందంటున్నారు. కాబట్టే రశ్మికకి అవకాశాలు తగ్గాయంటున్నారు. 

‘సరిలేరు నీకెవ్వరు, భీష్మ’ సినిమాల్లో ఏది హిట్ అయినా రశ్మిక మల్లి ఫామ్‌లోకొస్తుంది అంటున్నారు. ఎలాగూ గ్లామర్ షో చెయ్యదు, అసలే ఒక ప్లాప్ ఉంది ఎందుకులే అంటున్నారట హీరోలు కూడా. మరి రశ్మికకి నటనలో ఫుల్ మార్కులు పడినా గ్లామర్ పరంగా అంతంతే. ఇతర హీరోయిన్స్‌లా స్కిన్ షో చెయ్యదు. ఒకవేళ రశ్మిక చేసినా ఆమెలోని గ్లామర్ యాంగిల్ అంతగా ఉండదు. ఇక ఆమెను అదృష్టమే కాపాడాలి.

Sponsored links

Heroes not interested on Rashmika Mandanna:

Dear Comrade Effect on Rashmika Mandanna

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019