‘నీ కోసం’ టీమ్‌కు పవన్ అభినందనలు

Sat 24th Aug 2019 10:36 PM
pawan kalyan,power star,neekosam,wishes,avinash kokati,kalyan  ‘నీ కోసం’ టీమ్‌కు పవన్ అభినందనలు
Pawan Kalyan Greetings to Neekosam Team ‘నీ కోసం’ టీమ్‌కు పవన్ అభినందనలు
Sponsored links

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు పొందిన నీ కోసం టీం

మంచి ఎక్కడున్నా ప్రోత్సహించే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘నీకోసం’ టీమ్‌ని అభినందించి బెస్ట్ విషెస్ తెలిపారు. కొత్తదనం నిండిన ఈ ప్రేమకథ ట్రైలర్‌ని చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఈచిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ విజయం కొత్త వాళ్లకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం అని అన్నారు. కాన్సెప్ట్ గురించి తెలుసుకొని ఈ మూవీలో హీరోగా చేస్తున్న అజిత్ రాధారాంని అభినందించారు.

ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్సాన్స్‌ని రాబట్టుకుంది. కాన్సెప్ట్ బేస్డ్ గా కనిపిస్తూనే కథ, కథనపరంగా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా కనిపిస్తున్నాయి ట్రైలర్ లో. చూసిన వాళ్లంతా బాగుందని అభినందిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రం ‘నీకోసం’. అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రల్లో నటించారు.

రాజలింగం సమర్పణలో నవీన్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీకి అవినాష్ కోకటి దర్శకుడు.

బ్యానర్: తీర్ధ సాయి ప్రొడక్షన్స్

ప్రొడ్యూసర్: అల్లూరమ్మ (భారతి)

సినిమాటోగ్రఫీ: శివక్రిష్ణ యెడుల పురమ్

ఎడిటింగ్: తమ్మిరాజు

ఆర్ట్: క్రాంతి ప్రియ

పి.ఆర్.ఓ: జియస్‌కె మీడియా

రచన, దర్శకత్వం: అవినాష్ కోకటి

Sponsored links

Pawan Kalyan Greetings to Neekosam Team:

Power Star Pawan Kalyan Wishes to Neekosam Team

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019