మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ‘గ్యాంగ్ లీడర్’ (మళ్ళీ మొదలవుతుంది రచ్చ)టీజర్ విడుదల..!!
మాణిక్యం మూవీస్, ఎస్.ఎమ్.కె ఫిలిమ్స్ పతాకాలపై సింగులూరి మోహన్ రావు నిర్మాతగా సిహెచ్.రవి కిషోర్ బాబు దర్శకత్వంలో ‘బావమరదలు’ చిత్ర ఫేమ్ మోహన్ కృష్ణ , హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’... మళ్ళీ మొదలవుతుంది రచ్చ అనేది టాగ్ లైన్.. ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా... మెగా అభిమానుల సమక్షంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు మెగా అభిమాని అయిన మోహన్ కృష్ణ ‘గ్యాంగ్ లీడర్’ (మళ్ళీ మొదలవుతుంది రచ్చ) టీజర్ ను విడుదలచేశారు.. ఈ సందర్భంగా..
చిత్ర దర్శకుడు సిహెచ్.రవి కిషోర్ బాబు మాట్లాడుతూ.. ‘‘సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా టైటిల్ కావడం వల్ల ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, సినిమాని తెరకెక్కిస్తున్నాం.. అన్ని అంశాలు ఇటు ప్రేక్షకులు, అటు మెగా అభిమానులు మెచ్చే విధంగా ఉంటాయి.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.
హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ... ‘‘నా పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాం, మంచి ఆదరణ లభించింది. ఆగష్టు 22 నా అభిమాన హీరో చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానుల సమక్షంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు ‘గ్యాంగ్ లీడర్’ టీజర్ ను విడుదల చేయడం చాలా సంతోషం. స్వతహాగా మెగాస్టార్ అభిమానినైన నేను ఆయన సూపర్ హిట్ సినిమా టైటిల్ తో వస్తున్న మూవీ కాబట్టి మెగా అభిమానులందరిని అలరించే విధంగా టీజర్, సినిమా ఉంటుంది’’ అన్నారు.
నటీనటులు : మోహన్ కృష్ణ, హరిణి రెడ్డి, సుమన్,తణికెళ్లభరణి, రంగస్థలం మహేష్, చిత్రం శ్రీను, రావూరి రమేష్, జబర్దస్త్ అప్పారావు, ఎల్.బి,శ్రీరామ్, జబర్దస్త్ బాబీ, వరహాల బాబు, బాలాజీ, గీత సింగ్, లడ్డు, సీత, జయలక్ష్మి, తదితరులు...
సాంకేతిక నిపుణులు :
ప్రొడ్యూసర్ : సింగులూరి మోహన్ రావు (MA , B.Ed )
బ్యానర్ : మాణిక్యం మూవీస్, ఎస్.ఎమ్.కె ఫిలిమ్స్
సమర్పణ : కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, మనీషా ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
దర్శకుడు : సిహెచ్. రవికిషోర్ బాబు
సంగీతం : బండారు దానయ్య కవి
సినిమాటోగ్రఫీ : శివ
ఎడిటర్ : నందమూరి హరి
ఫైట్ మాస్టర్ : రామ్ సుంకర