శివ కంఠమనేని న్యూ మూవీ వివరాలివే!

Fri 23rd Aug 2019 02:32 PM
siva kantamaneni,nanditha swetha,combo,new movie  శివ కంఠమనేని న్యూ మూవీ వివరాలివే!
Siva Kantamaneni New Film Details శివ కంఠమనేని న్యూ మూవీ వివరాలివే!
Sponsored links

శివ కంఠమనేని హీరోగా ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా

‘అక్కడొకడుంటాడు’తో శివ కంఠమనేని నటుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నెల 24న ఆయన మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. 

శివ కంఠమనేని ప్రధాన పాత్రలో లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు  24న రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభం కానుంది. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నందితా శ్వేత, రాశి, కె. అశోక్‌కుమార్‌ ఇతర ప్రధాన తారాగణం.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ శనివారం పూజా కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోస్‌లో చిత్రాన్ని ప్రారంభిస్తాం. అదే రోజున  రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. రెండు షెడ్యూళ్లలో చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. నాలుగు పాటల రికార్డింగ్‌  పూర్తయింది. వీటిలో మంగ్లీ పాడిన ‘చదివిందేమో టెన్త్‌రో... అయ్యిందేమో డాక్టరో’ పాటను ‘గీత గోవిందం’లో ‘కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారేపోయింది’ రాసిన సాగర్‌ 

రాశారు. సినిమా టైటిల్‌ ఇంకా ఖరారు చేయలేదు’’ అన్నారు.

శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశి, కె. అశోక్‌కుమార్‌, అజయ్‌, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, ‘బిత్తిరి సత్తి, అజయ్‌ ఘోష్‌, ఆదిత్యా మీనన్‌, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న  ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

సాంకేతిక నిపుణుల వివరాలు....

స్టంట్స్‌: సతీష్‌

కూర్పు: ఆవుల వెంకటేశ్‌

కళా దర్శకుడు: కె.వి. రమణ

మాటలు: అంజన్‌

ఛాయాగ్రహణం: హరీష్‌

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: గంటా శ్రీనివాసరావు

నిర్మాణ సంస్థ పేరు: లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌

సంగీత దర్శకులు: యశస్వినీ గున్ను, సుధాకర్‌ మారియో

నిర్మాతలు: జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావు, వి. కృష్ణారావు

కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్‌ మేగోటి

Sponsored links

Siva Kantamaneni New Film Details:

Movie in Siva Kantamaneni and Nanditha Swetha Combos  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019