Advertisementt

బండ్ల గణేష్‌కి షాకిచ్చారు..!

Wed 21st Aug 2019 10:09 PM
bandla ganesh,sarileru neekevvaru,shock,anil ravipudi,4 days shooting  బండ్ల గణేష్‌కి షాకిచ్చారు..!
Shock to Bandla Ganesh From Sarileru Neekevvaru Team బండ్ల గణేష్‌కి షాకిచ్చారు..!
Advertisement
Ads by CJ

కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న బండ్లకి ‘సరిలేరు నీకెవ్వరు’ టీం షాకివ్వడమేమిటి అనుకుంటున్నారా... అదేనండి గతంలో కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన బండ్ల గణేష్ తర్వాత ఓ బడా రాజకీయనాయకుడు అండతో పెద్ద పెద్ద సినిమాలను నిర్మించాడు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాడు. కానీ గత కొన్నాళ్లుగా నిర్మాతగా కూడా బండ్ల కనిపించడం లేదు. ఇక చాలారోజుల తర్వాత మొహానికి రంగేసుకుని కమెడియన్‌గా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మహేష్‌తో సినిమా, దర్శకుడు అనిల్ రావిపూడి హిట్ డైరెక్టర్ అని.. బండ్ల గణేష్ ఎగిరి గంతేసి ఈ సినిమా ఒప్పుకోలేదు.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో బండ్ల కామెడీ చేసినందుకు గాను.. రోజుకి ఐదు లక్షల ఆఫర్ చెయ్యడం... బండ్ల గణేష్‌కి ఆ ఆఫర్ నచ్చి ఈ సినిమాతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. అయితే మహేష్ - అనిల్ రావిపూడి కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్‌ని ఓ రేంజ్ లో పరిగెత్తిస్తున్నారు. ట్రైన్ స్పీడు కన్నా వేగంగా అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేస్తున్నాడు. బండ్ల గణేష్ అండ్ కమెడియన్స్ బ్యాచ్ చేసే కామెడీ సినిమాకే హైలెట్ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే రోజుకి ఐదు లక్షల పారితోషకంతో హాట్ టాపిక్‌గా మారిన బండ్ల గణేష్‌కి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు టీం షాకిచ్చిందట. 

ఎందుకంటే బండ్లతో ఉన్న సీన్స్‌ని కేవలం నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసి బండ్ల చేతిలో 20 లక్షలు పారితోషకం పెట్టారట. మరి రోజుకి ఐదు లక్షలు. నాలుగు రోజులకి 20 లక్షలుగా... అలా అన్నమాట. అయితే ఇది బండ్ల గణేష్ అసలు ఊహించలేదట. బడా సినిమా డేట్స్ అడిగారంటే మినిమం ఓ పది రోజులు అయినా ఉంటాయనుకున్నాడట. కానీ సరిలేరు టీం మాత్రం కేవలం నాలుగు రోజులకే బండ్ల‌ని ఇంటికి పంపేసింది.

Shock to Bandla Ganesh From Sarileru Neekevvaru Team:

Bandla Ganesh Shocks with Sarileru Neekevvaru Shooting

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ