కాజల్ మరీ ఫీల్ అవ్వాల్సిన పనిలేదు!

Mon 19th Aug 2019 08:18 PM
kajal agarwal,komali,jayam ravi,hit movie,tollywood,kollywood  కాజల్ మరీ ఫీల్ అవ్వాల్సిన పనిలేదు!
2 Flops and 1 Hit to Kajal Agarwal కాజల్ మరీ ఫీల్ అవ్వాల్సిన పనిలేదు!
Sponsored links

కెరీర్ పరంగా కాజల్ అగర్వాల్‌కి ఏమి అంతగా కలిసి రావడంలేదు. ఈ ఏడాది ఆమెకు టాలీవుడ్‌లో వరసగా రెండు డిజాస్టర్స్ వచ్చాయి. మొదటి సమ్మర్‌లో సీత సినిమాతో పాటు మూడు రోజులు కిందట రిలీజ్ అయిన రణరంగం సినిమాలతో నిరాశపరిచింది కాజల్. కానీ కోలీవుడ్‌లో ఈ వీక్ రిలీజ్ అయిన ‘కోమాలి’ అనే చిత్రంతో హిట్ అందుకుంది.

ఇందులో జయం రవి హీరోగా నటించాడు. పదహారేళ్ల తర్వాత జయం రవి కోమా నుండి బయటకు వస్తాడు. వచ్చిన తరువాత పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది సినిమా. సినిమా మొత్తం కడుపుబ్బ నవ్విస్తోంది. ట్రైలర్‌కే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా సినిమాకి అయితే మంచి టాక్ వచ్చింది.

ఇందులో కాజల్ ది గ్లామర్ క్యారెక్టరే అయినప్పటికీ ఆమెకు మంచి హిట్ పడటంతో సంతోషంగా ఉండే ఉంటుంది. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 తో పాటు మరో తెలుగు సినిమా చేస్తుంది.

Sponsored links

2 Flops and 1 Hit to Kajal Agarwal:

Kajal Agarwal gets hit in Kollywood

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019