చిరు కోసం కొరటాల కథ మారుస్తున్నాడంట!

Mon 19th Aug 2019 07:23 PM
koratala siva,chiranjeevi,farmers,story,change,chiru request  చిరు కోసం కొరటాల కథ మారుస్తున్నాడంట!
Koratala Siva Changed Story for Chiranjeevi చిరు కోసం కొరటాల కథ మారుస్తున్నాడంట!
Sponsored links

చిరు - కొరటాల కాంబోలో తెరకెక్కబోయే సినిమా మరికొద్ది రోజుల్లో సెట్స్ మీదకెళుతుందని.. ఈ సినిమా కోసం చిరంజీవి బాగా బరువు తగ్గుతున్నాడనే ప్రచారం చిరు న్యూ లుక్ బయటికొచ్చిన దగ్గరనుండి జరుగుతూనే ఉంది. ఇక సైరా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసిన చిరు కూడా కొరటాలతో చెయ్యబోయే సినిమా గురించి బాగా బరువు తగ్గుతున్నాడు కూడా. ఇప్పటికే నాన్ వెజ్ మానేసి కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటూ జిమ్ లో గంటలు గంటలు వర్కౌట్స్ చేస్తున్నాడట. అయితే కొరటాల శివ - చిరంజీవి కాంబోలో తెరకెక్కబోయే సినిమా రైతుల సమస్యల నేపథ్యంలో ఉండబోతుందని, చిరు ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడనే న్యూస్ ఉంది. ఇక దాదాపుగా కొరటాల శివ చెప్పిన కథకు చిరు ఎప్పుడో కనెక్ట్ అవడం, పూర్తి స్క్రిప్ట్‌తో కొరటాల కూడా చిరు కోసం వెయిట్ చెయ్యడం జరిగింది.

ఇక కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ ఎంత పకడ్బందీగా ఉంటుందో మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను కి చూసాం. అయితే ఫుల్ స్క్రిప్ట్ తో వెయిట్  చేస్తున్న కొరటాలతో చిరు రీసెంట్‌గా మన కథ మారిస్తే బావుంటుందని.. ఎందుకంటే ఈమధ్యనే వచ్చిన ఖైదీ నెంబర్ 150, అలాగే మహేష్ మహర్షి సినిమాల్లో రైతు సమస్యల పై తీసిన కాన్సెప్ట్ గనక మనం మళ్లీ అదే నేపథ్యంలో సినిమా చేస్తే వర్కౌట్ అవ్వదని చెప్పడంతో కొరటాల కూడా అది నిజమే అని మారు మాట్లడకుండా ఆ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఇక కథ ఫైనల్ అయ్యాక చిరు మరోసారి కొరటాలతో చర్చించిన తరవాతే చిరు - కొరటాల మూవీ పట్టాలెక్కుతుందనేది తాజా సమాచారం.

Sponsored links

Koratala Siva Changed Story for Chiranjeevi:

Koratala Siva and Chiranjeevi Combo Film Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019