రోజా.. ఒక వారానికేనా.. మొత్తానికా!?

Sun 18th Aug 2019 10:39 AM
mla roja,good bye,jabardasth,ap politics  రోజా.. ఒక వారానికేనా.. మొత్తానికా!?
MLA Roja Says Good Bye To Jabardasth! రోజా.. ఒక వారానికేనా.. మొత్తానికా!?
Sponsored links

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి గెలిచిన రోజా.. ఇటు బుల్లి తెరపైన.. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్న విషయం విదితమే. ఇప్పటికీ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆమె.. బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోకు ‘జబర్దస్త్’కు మాత్రం ఇంతవరకూ గుడ్ బై చెప్పలేదు. అయితే రోజాను తన కేబినెట్‌లోకి తీసుకోలేకపోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కీలక పదవే కట్టబెట్టారు.

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజాను నియమిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత.. పదవికి కొత్త కావడంతో పూర్తి సమయాన్ని పాలిటిక్స్‌కే పరిమితం చేశారు. దీంతో జబర్దస్త్‌కు టాటా చెప్పేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల విడుదలైన ప్రోమోలో జడ్జి స్థానంలో రోజా కనిపించకపోవడంతో ఈ వార్తలు అక్షరాలా నిజమేనని నమ్మాల్సి వస్తోంది. ఇప్పటికే రోజా స్థానంలో అప్పుడప్పుడు వచ్చి పోతున్న ‘ఢీ’ జడ్జ్, టాలీవుడ్ ప్రముఖ కొరియోఫర్ శేఖర్ మాస్టర్ దర్శనమిచ్చారు. అయితే రోజా ఈ ఒక్క వారానికేనా..? లేకుంటే పర్మినెంట్‌గా ఈ షోకు టాటా చెప్పేశారా..? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

MLA Roja Says Good Bye To Jabardasth!:

MLA Roja Says Good Bye To Jabardasth!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019