‘ఎవరు’ కొడితేనే నిలబడుతుంది..!

Wed 14th Aug 2019 12:21 PM
regina,hopes,evaru movie  ‘ఎవరు’ కొడితేనే నిలబడుతుంది..!
Regina waiting for Evaru Success ‘ఎవరు’ కొడితేనే నిలబడుతుంది..!
Sponsored links

తెలుగులో కాస్త ట్రెడిషనల్ పాత్రల్లో నటించినా  అమ్మడుకి క్రేజ్ మాత్రం రాలేదు. అన్ని యావరేజ్ హిట్స్ నే సొంతం చేసుకున్న రెజీనా కాసాండ్రా అందాల ఆరబోతకు సిద్దమే అంటూ... జీరో సైజు ట్రై చేసిన రెజీనాకి అస్సలు ఆఫర్స్ మాత్రం రాలేదు. యంగ్ హీరోలు కూడా రెజీనాని పట్టించుకోవడం మానేశారు. అయితే రెజీనా కోలీవుడ్ లో గ్లామర్ పాత్రలు చేస్తూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. కానీ అమ్మడుకి ఓ అన్నంత అవకాశాలు మాత్రం రాలేదు. హాట్ హాట్ గ్లామర్ పాత్రలకు సై అని ఎన్నిసార్లు సోషల్ మీడియా ద్వారా చెప్పాలని చూసినా రెజీనాని పట్టించుకున్న నాథుడే లేదు.

తాజాగా ఎవరు సినిమాలో అడవి శేషు సరసన నటించిన రెజీనాకి ఈ సినిమా హిట్ ఎంతో అవసరం. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు సినిమా మీద మంచి ఆసక్తి అంచనాలే ఉన్నాయి. అడవి శేషు గత సినిమాలు క్షణం, గూఢచారి సినిమాలు హిట్ అవడం, అలాగే క్రైం థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ లోను అంచనాలున్నాయి. 

రెజీనా కాసాండ్రా రేప్ కి గురైన అమ్మాయిగా, తనని బలాత్కరించిన వ్యక్తిని మర్డర్ చేసిన అమ్మాయిగా గ్లామర్ గా కనిపిస్తుంది. రేపు గురువారం ఆగష్టు 15 న విడుదల కాబోతున్న ఎవరు సినిమా గనుక హిట్ అయితే మళ్ళీ రెజీనా కెరీర్ టాలీవుడ్ లో ఊపందుకునే అవకాశం ఉంది. మరి రేపు ఒక్కరోజులో రెజీనా జాతకం టాలీవుడ్ లో ఎలా ఉండబోతుందో అనేది తేలిపోతుంది.

Sponsored links

Regina waiting for Evaru Success:

Regina Full Hopes on Evaru Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019