మహేష్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు..!

Wed 14th Aug 2019 12:17 PM
mahesh babu,anil ravipudi,super speed,sarileru neekevvaru  మహేష్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు..!
Sarileru Neekevvaru Shooting in Full Speed మహేష్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు..!
Sponsored links

ఎప్పుడు ఆరామ్స్ గా షూటింగ్ చేస్తూ.. మధ్యమధ్యలో ఫ్యామిలీ ట్రిప్స్ వెయ్యడమే కాకుండా... యాడ్ షూట్స్ అంటూ సినిమా షూటింగ్ లకు బ్రేకిచ్చే మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు కోసం పరిగెడుతున్నాడు. మహర్షి సినిమా తర్వాత ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు అంటూ ఓ సినిమాని మొదలెట్టడమే కాదు.. శరవేగంగా షూటింగ్ ని ఓ రేంజ్ లో కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమా ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సీన్స్ మినహా చాలా షూటింగ్ కంప్లీట్ అయ్యింది కూడా. అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో వేసిన స్పెషల్ ట్రైన్ సెట్ లో సినిమాలోని ముప్పై నుండి నలభై నిమిషాల షూటింగ్ ని అనిల్ రావిపూడి ట్రైన్ కంటే వేగంగా పూర్తి చేసాడు.

ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ ట్రైన్ సెట్ లో పూర్తయిన సరిలేరు నీకెవ్వరు షూటింగ్ తర్వాత రామోజీ ఫిలింసిటీలో  వేసిన కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్స్ మీదకి మహేష్, అనిల్ రావిపూడి వెళతారు. ఇప్పటికే అలనాటి మేటి హీరోయిన్ విజయశాంతి సరిలేరు నీకెవ్వరు కోసం రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు.. తాజాగా సినిమా షూటింగ్ లోను పాల్గొంటుంది. మరి కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించి.. ఒరిజినాలిటీ కోసం ఒరిజినల్ కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ లోను కొన్ని సన్నివేశాలని మహేష్ లేకుండా తెరకెక్కించనున్నాడు అనిల్ రావిపూడి. 

తరువాత ఓ పెళ్లి సీన్ అంటే సరిలేరు సినిమా క్లైమాక్స్ కోసం కేరళ వెళ్లిపోతుంది మూవీ టీం. మరి ఎప్పుడూ ఆచి తూచి షూటింగ్ చేసే మహేష్, అనిల్ రావిపూడి స్పీడుతో షూటింగ్ లో మాత్రం జోరుగా యాక్టీవ్ గా పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ కి పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా... మంచి ప్రమోషన్స్ తో ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యబోతున్నారు.

Sponsored links

Sarileru Neekevvaru Shooting in Full Speed:

Mahesh Babu Super Speed for Sarileru Neekevvaru

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019