నేనేం డబ్బుల కోసం ఎంజాయ్ చేయట్లేదు..!

Tue 13th Aug 2019 01:07 PM
mission mangal,akshay kumar,nithya menen,bollywood  నేనేం డబ్బుల కోసం ఎంజాయ్ చేయట్లేదు..!
I Am not Doing This For Money Nithya Angry నేనేం డబ్బుల కోసం ఎంజాయ్ చేయట్లేదు..!
Sponsored links

నిత్యా మీనన్.. ఈ పేరు ప్రత్యేకించి మరి పరిచయం చేయనక్కర్లేదు. తెలుగులో నటించి మెప్పించి.. తన ఖాతాలో వేసుకున్న హిట్ చిత్రాలు తక్కువే అయినప్పటికి అభిమానులను మాత్రం గట్టిగానే సంపాదించుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం ‘మిషన్ మంగళ్’. పంద్రాగస్టున సినిమా రిలీజ్ కానుండటంతో కొద్దిరోజులే సమయం ఉండటంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా నిత్యామేనన్‌ దిగిన ఫొటోలు కొన్ని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

ఇదిగో.. పక్కనున్న ఈ ఫొటోలే నెట్టింట్లో హల్ చేస్తున్నాయి. అయితే నిత్యా తన సొంత రాష్ట్రంలో వరదలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తమరేమో ఇలా ఫొటోలను షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలా తనపై విమర్శలు గుప్పిస్తున్న వారికి ఓ వీడియో ద్వారా కౌంటరిస్తూ అసలు విషయం చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

బుద్ధిలేని వారు కొందరు తనపై విమర్శలు గుప్పిస్తున్నారు.. వారికోసమే వీడియో చేస్తున్నాను. తాను ఇలాంటి విషయాలపై సాధారణంగా పట్టించుకోను.. కానీ ఈసారి స్పందించాల్సి వచ్చిందని వీడియోలో చెప్పుకొచ్చింది. చిత్రబృందం అంతా కలిసి కేరళ బాధితులకు సాయం చేయాలని అనుకుంటున్నామని.. ఆ విషయం మీకు తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తున్నారని ఒకింత ఆగ్రహానికి లోనైంది. సినిమా ఒప్పుకున్న తర్వాత ప్రమోషన్స్ చేయకుండా ఎలా ఉంటారు..? ప్రమోషన్స్ పాల్గొనడం తన డ్యూటీ అని చెప్పుకొచ్చింది. నేనేం డబ్బుల కోసమే ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఎంజాయ్‌ చేయట్లేదని ఈ సందర్భంగా ఆమె విమర్శలకు గడ్డిపెట్టింది.

Sponsored links

I Am not Doing This For Money Nithya Angry:

I Am not Doing This For Money Nithya Angry

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019