ఉద్యోగాల కోసం ప్రముఖ హీరో ఉద్యమం !

Tue 13th Aug 2019 01:02 PM
karnataka,jobs,kannadigas,upendra  ఉద్యోగాల కోసం ప్రముఖ హీరో ఉద్యమం !
Karnataka Jobs for Kannadigas Says Actor Upendra ఉద్యోగాల కోసం ప్రముఖ హీరో ఉద్యమం !
Sponsored links

ఇదేదో రీల్ లైఫ్‌లో కాదండోయ్ బాబూ.. రియల్ లైఫ్‌లోనే.. రాష్ట్రంలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇచ్చి తీరాల్సిందేనని కన్నడ ప్రముఖ హీరో ఉపేంద్ర ఉద్యమం బాట పట్టారు. ఒక రాష్ట్రంలోని ఉద్యోగాలకు మరో రాష్ట్రం వారు అంటే నాన్ లోకల్‌ కింద అప్లై చేసుకుని.. ఉద్యోగాలు సంపాదించుకోవడం ఎప్పట్నుంచో నడుస్తోంది. అయితే ఉపేంద్ర మాత్రం.. ఏ రాష్ట్రం ఉద్యోగాలు ఆ రాష్ట్రం వారికే ఇవ్వాలంటూ పట్టుబట్టారు. అంతేకాదు.. ప్రభుత్వం తన డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఈ నెల 14, 15 తారీఖుల్లో గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవల ఓ వీడియోను విడుదల చేసిన ఉపేంద్ర.. ఇందులో ఈ ఉద్యోగాల ప్రస్తావన తెచ్చారు. తనకు యువత మద్దతిస్తే ఎంతవరకైనా పోరాడుతానని.. మీ అందరి సహకారంతో ఉద్యమిస్తానని.. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నట్లు వీడియోలో ఉపేంద్ర తెలిపారు. ఐటీ రాజధాని అయిన బెంగళూరుకు దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం నిరుద్యోగులు వచ్చిపోతుంటారన్న విషయం విదితమే. అయితే ఉపేంద్ర చేస్తున్న ఉద్యమం ఎంతవరకు సక్సెస్ అవుతుందో..? సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

Karnataka Jobs for Kannadigas Says Actor Upendra:

Karnataka Jobs for Kannadigas Says Actor Upendra  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019