ఈ హాట్‌ భామకు డబ్బులు ఎగ్గొడుతున్నారట..!

Sun 11th Aug 2019 09:49 PM
radhika apte,revealed,serious,problem,bollywood,hollywood,remuneration  ఈ హాట్‌ భామకు డబ్బులు ఎగ్గొడుతున్నారట..!
Radhika Apte Sensational Comments on Bollywood ఈ హాట్‌ భామకు డబ్బులు ఎగ్గొడుతున్నారట..!
Sponsored links

బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎప్పుడు చూసిన ఈమె తన హాట్ హాట్ వ్యాఖ్యలతో.. హాట్ అందాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక టాలీవుడ్‌లో చేసింది రెండు సినిమాలే అయినా ఈ ముద్దుగుమ్మ చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు. అప్పట్లో న్యూడ్‌ షోలు, సెమీ న్యూడ్‌ షోలతో వివాదాలతో వార్తల్లో నిలవని రోజే లేదు. అయితే ఇంత చేస్తున్నా ఈ హాట్ భామకు రోజులు కలిసిరావట్లేదు. 

బాలీవుడ్‌ను ప్రస్తుతానికి టాటా చెప్పేసి.. హాలీవుడ్ చెక్కేసిన ఈ భామకు సొంత ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. బాలీవుడ్‌ నిర్మాతలు డబ్బులు సరిగ్గా ఇవ్వరని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగని ఈ భామ.. బాలీవుడ్‌లో లాగా హాలీవుడ్‌లో రెమ్యునరేషన్‌ గురించి ఇబ్బందులు పెట్టరని.. అన్నీ అనుకున్నట్లుగానే తేల్చేస్తారన్నది. ప్రాజెక్ట్ పూర్తవ్వగానే లెక్కపూర్తిగా తేల్చేస్తారని చెప్పుకొచ్చింది. మొత్తానికి చూస్తే బాలీవుడ్‌లో ఈమెను ఎవరో బాగానే డబ్బులు విషయంలో ఇబ్బందిపెట్టారని తెలుస్తోంది. ఆ నిర్మాత ఎవరో మరి..! కాగా.. ఈమె ప్రస్తుతం హాలీవుడ్‌లో ‘వెడ్డింగ్‌ గెస్ట్‌’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Sponsored links

Radhika Apte Sensational Comments on Bollywood:

Radhika Apte Revealed Serious Problem in Bollywood

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019