ఫాల్తు మాటలొద్దు.. నాగ్ సీరియస్ వార్నింగ్!

Sun 11th Aug 2019 09:41 PM
nagarjuna,serious,warning,bigg boss,house  ఫాల్తు మాటలొద్దు.. నాగ్ సీరియస్ వార్నింగ్!
Nag Serious Warning to Bigg Boss Contestants ఫాల్తు మాటలొద్దు.. నాగ్ సీరియస్ వార్నింగ్!
Sponsored links

ఇదేంటి అక్కినేని నాగార్జున ఇంత సీరియస్ అయ్యారెందుకు..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును బిగ్‌బాస్-3 హౌస్‌లో కొందరు చేస్తున్న పనులతో నాగ్ సహనం కోల్పోయి మాట్లాడాల్సి వచ్చింది. ఇన్ని రోజులూ వారితో సరదాగా నవ్వుతూ తాను అసలు హోస్ట్‌ను కాదని మాట్లాడిన నాగార్జున.. శనివారం రోజున అనగా 21వ ఎపిసోడ్‌లో మాత్రం తన విశ్వరూపం చూపించారు. హౌస్‌లో హద్దులు దాటుతున్న కంటెస్టెంట్లకు ఛీవాట్లు పెట్టారు. ముఖ్యంగా అలీ రెజా, తమన్నా సింహాద్రి, రాహుల్‌ సిప్లిగంజ్‌కు క్లాస్ పీకారు. వితికా ఆ నటనేంటి..? అసలేం చేస్తున్నావ్..? అంటూ చురకలు అంటించారు.

రవికృష్ణకి చేయి తెగినప్పుడు రాహుల్.. ‘ఫాల్తు ఐడియాలు.. ఫాల్తు మొహంది’ అంటూ శ్రీముఖిపై మితిమిరీన మాటలు మాట్లాడాడు. ఈ విషయాలను ప్రస్తావించిన నాగ్... ‘అందరూ శ్రీముఖి మీద పడ్డారేం. ఆమె డంబెల్ ఇచ్చి కొట్టింది అని.. రాహుల్ కూడా ఫాల్తు మాటలు చాలా మాట్లాడాడు. రాహుల్ ఇది ఆఖరి వార్నింగ్.. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఫాల్తు మాటలు మాత్రం అసలు వద్దు’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం రాహుల్‌తో శ్రీముఖికి సారీ చెప్పించడంతో వివాదానికి కాస్త ఫుల్‌స్టాప్ పడినట్లైంది.

Sponsored links

Nag Serious Warning to Bigg Boss Contestants:

Nagarjuna Sensational Comments at Bigg Boss House

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019