Advertisementt

సమంతకు క్రేజ్, రేంజ్ ఉంది కాబట్టే..!!

Sun 28th Jul 2019 06:00 PM
samantha,remuneration,hiked,craze,range,heroine samantha,nayanthara  సమంతకు క్రేజ్, రేంజ్ ఉంది కాబట్టే..!!
Rumours on Samantha Salary సమంతకు క్రేజ్, రేంజ్ ఉంది కాబట్టే..!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లక్కీ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే అందరూ సమంత పేరే చెబుతారు. ఎందుకంటే ఆమె ఏ సినిమా చేసినా.. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇక రీసెంట్‌గా ఆమె చేసిన ఓ బేబీ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈసినిమా యూఎస్‌లో కూడా దుమ్మురేపుతోంది. యూఎస్‌లో ఈమూవీ ఏకంగా వన్ మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.

నిజానికి వన్ మిలియన్ మార్క్ సాధించడం అనేది మన స్టార్ హీరోస్ కి తప్ప ఒక రేంజ్ హీరోస్ కి అయితే సాధ్యం కానీ విషయం. కానీ సమంత ఆ ఫీట్ ని ఈజీగా దాటేసింది. ఇక ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. అందుకే క్రేజ్ తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. అవును గత కొన్ని రోజులు నుండి సామ్ రెమ్యూనరేషన్ పైనే వార్తలు నడుస్తున్నాయి. ఈమె తన నెక్స్ట్ సినిమాల కోసం రెమ్యూనరేషన్ పెంచేసిందట. ఇప్పుడు తన పారితోషకాన్ని గతంలో తీసుకున్న దానికంటే ఒక కోటి మేర ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. 

మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ రూమర్ బాగా వైరల్ అవుతుంది. ఒకవేళ ఆమె పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె సక్సెస్ రేషియో అలా ఉంది. సౌత్ ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా నయనతార మొదట ప్లేస్‌లో ఉంది.

Rumours on Samantha Salary :

Samantha Hiked Her Remuneration

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ