Advertisement

బిగ్‌బాస్ 3: ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Sun 28th Jul 2019 05:51 PM
bigg boss,telugu season,contestant,telugu season 3,nagarjuna,elimination,hema  బిగ్‌బాస్ 3: ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
Bigg Boss 3 Telugu Elimination Contestant Leaked బిగ్‌బాస్ 3: ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
Advertisement

తెలుగు బిగ్‌బాస్ అనేక కాంట్రవర్సీలతో గత ఆదివారమే మొదలై నేడు ఆదివారానికి వారం రోజులు పూర్తి చేసుకుంది. కింగ్ నాగార్జున ఎన్టీఆర్, నాని లకు ఏ మాత్రం తీసిపోకుండా హౌస్ వ్యాఖ్యాతగా చేస్తున్నాడు. నాగ్ స్టయిల్, హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరూ సేఫ్‌గా ఆడుతున్నారు అని అనిపిస్తున్నప్పటికీ... బిగ్ బాస్ సీజన్ 3 మొదలై వారం గడవకముందే హౌస్‌లో రోజుకో గొడవ అన్నట్టుగా తయారైంది అక్కడ బిగ్‌బాస్ హౌస్ వ్యవహారం. మరి బిగ్‌బాస్ చెప్పినట్టుగా స్క్రిప్ట్ ప్రకారమే ఆ గొడవలు జరుగుతున్నాయో.. లేదంటే నిజంగానే వారి మధ్య అలాంటి వాతావరణం ఉందో తెలియదు గాని.. గొడవలతో షోని కంటెస్టెంట్స్ రక్తి కట్టిస్తున్నారు.

ఇక ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేషన్స్‌లో హేమ, జాఫర్, హిమజ, పునర్నవి, వితిక, రాహుల్ ఉన్నారు. నిన్న శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున హిమజాని, పునర్నవిని ఎలిమినేషన్ నుండి సేవ్ చేసాడు. ఇక మిగిలిన నలుగురిలో ఈ రోజు ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మీద అనేక ఊహాగానాలు ఉన్నాయి. అయితే హౌస్‌లో అందరి మీద కాస్త పెత్తనం చేస్తూ ఉన్న నటి హేమ ఈ రోజు ఎలిమినేట్ కాబోతుంది. ఈవిషయం ముందుగానే సామాజిక మాధ్యమాల్లో రావడం అందరిని షాక్ కి గురిచేస్తుంది కానీ... ఈ వారం బిగ్ బాస్ 3 నుండి ఎలిమినేట్ కాబోయే ఫస్ట్ కంటెస్టెంట్ మాత్రం నటి హేమనే అనే న్యూస్ మాత్రం బాగా హైలెట్ అయ్యింది.

Bigg Boss 3 Telugu Elimination Contestant Leaked:

Thos contestant Out of Bigg Boss Telugu Season 3?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement